Pawan Kalyan: కలియుగ దైవానికి అపచారం జరిగితే ఊరుకుంటామా..? వారాహి సభలో పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
తిరుపతిలో వారాహి బహిరంగ సభలో డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కలియుగ దైవానికి అపచారం జరిగితే ఊరుకుంటామా అంటూ పేర్కొన్నారు. సనాతన ధర్మాన్ని అవమానిస్తే సహించమని స్పష్టంచేశారు. 11 సీట్లకు భగవంతుడు కుదించినా బుద్ధిరాలేదంటూ వైసీపీ పై ఫైర్ అయ్యారు.
తిరుపతిలో వారాహి బహిరంగ సభలో డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కలియుగ దైవానికి అపచారం జరిగితే ఊరుకుంటామా అంటూ పేర్కొన్నారు. సనాతన ధర్మాన్ని అవమానిస్తే సహించమని స్పష్టంచేశారు. 11 సీట్లకు భగవంతుడు కుదించినా బుద్ధిరాలేదంటూ వైసీపీ పై ఫైర్ అయ్యారు. హిందువుగా సనాతన ధర్మాన్ని ఆరాధిస్తానని.. ఇస్లాం, క్రిస్టియన్, సిక్కు, ఇతర మతాలను గౌరవిస్తానంటూ పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. భిన్నత్వంలో ఏకత్వం చూపించేది సనాతన ధర్మం.. ప్రసాదంలో అపచారం జరిగింది.. ప్రాయశ్చిత్త దీక్ష చేపడితే అవహేళన చేస్తారంటూ విమర్శించారు. కొందరు సూడో మేధావులు ఇష్టారీతిగా మాట్లాడుతున్నారని.. సనాతన ధర్మాన్ని కొందరు అంతం చేస్తామంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. జంతు కొవ్వుతో చేసిన నైవేద్యం శ్రీవారికి పెడతారు.. అవే లడ్డూలు అయోధ్య రామాలయానికి పంపుతారు.. రాముడి విగ్రహావిష్కరణపై రాహుల్ విమర్శలు చేస్తారంటూ ఫైర్ అయ్యారు. సనాతన ధర్మానికి రంగు, వివక్ష లేదు.. సనాతన ధర్మం పాటించే వారంతా ఏకంకావాలి.. సెక్యులరిజం వన్‌వే కాదు.. టూవే.. గౌరవం ఇవ్వండి..తీసుకోండి అంటూ పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
లైవ్ వీడియో చూడండి..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..