Tirumala: శాస్త్రోక్తంగా సాగిన అంకురార్పణ.. ధ్వజారోహణంతో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు షురూ..!

తిరుమల శ్రీవెంకన్న సన్నిధి బ్రహ్మోత్సవ వేడుకలకు సిద్ధమైంది. నవహ్నిక వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరగ్గా గురువారం(అక్టోబర్ 3) నుంచి అక్టోబర్ 12 దాకా బ్రహ్మోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం వైభవంగా నిర్వహించనుంది.

Tirumala: శాస్త్రోక్తంగా సాగిన అంకురార్పణ.. ధ్వజారోహణంతో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు షురూ..!
Tirumala Brahmotsavalu
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Oct 04, 2024 | 12:04 AM

తిరుమల శ్రీవెంకన్న సన్నిధి బ్రహ్మోత్సవ వేడుకలకు సిద్ధమైంది. నవహ్నిక వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరగ్గా గురువారం(అక్టోబర్ 3) నుంచి అక్టోబర్ 12 దాకా బ్రహ్మోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం వైభవంగా నిర్వహించనుంది. లక్షలాదిమంది భక్తులు తరలివచ్చే బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాల్లో నిర్మహించే సేవలను వీక్షించేందుకు ఏర్పాట్లు చేసింది టీటీడీ.

మీనా లగ్నంలో అర్చకులు శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహించనుండగా, రాత్రి నుంచి వాహన సేవలు మొదలు కానున్నాయి. 9 రోజుల పాటు వాహన సేవలు అందుకోనున్న మలయప్ప స్వామి భక్తులకు అభయ ప్రధానం చేయనుండగా ఈ నెల 12వ తేదీన చక్ర స్నానంతో వార్షిక బ్రహ్మోత్సవాలు ముగుస్తుండగా, శ్రీవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు.

అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడి బ్రహ్మోత్సవ వేళ తిరుపతి తిరుమల ముస్తాబైంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి 7 నుంచి 8 గంటల వరకు శాస్త్రోక్తంగా అర్చకులు అంకురార్పణ నిర్వహించగా శ్రీవారి సేనాధిపతి విశ్వక్సేనుడు ఆలయ మాఢవీధుల్లో ఊరేగింపుగా వెళ్లి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించారు. గురువారం సాయంత్రం 5.45 నుంచి 6 గంటల మధ్య మీనా లగ్నంలో శాస్త్రోక్తంగా ద్వజారోహణం టీటీడీ నిర్వహించనుంది. నేటి నుంచి 9 రోజుల పాటు దేవదేవుడు దేవేరులతో ఊరేగే బ్రహ్మోత్సవ వేడుక కన్నుల పండుగ సాగునుంది. శ్రీవారి బ్రహ్మోత్సవాల వాహన సేవలను భక్తుల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.

అంకురార్పణ లో భాగంగా స్వామివారి సేనాధిపతి విశ్వక్సేనులు తిరుచ్చి పల్లకి పై ఊరేగుతూ ఉత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించారు. అర్చకులు పుట్టమన్ను, నవదాన్యాలను సేకరించి అంకురార్పణలో భాగంగా వైదిక కార్యక్రమాలను నిర్వహించి మొలకేతిస్తారు. ఇక ముక్కోటి దేవతలను ఉత్సవాలకు ఆహ్వానిస్తూ గరుడ పతకాన్ని ఎగరవేయనున్న అర్చకులు బ్రహ్మోత్సవాలకు నాంది పలుకగా రాత్రి 9 గంటలకు పెద్దశేష వాహన సేవతో వాహన సేవలు ప్రారంభమయ్యాయి.

దసరా సెలవుల, పెరటాసి మాసం కారణంగా బ్రహ్మోత్సవాలకు రద్దీ గణనీయంగా ఉండే అవకాశం ఉందని టీటీడీ అంచనా వేస్తోంది. ఈ మేరకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు అన్ని వసతులు, సౌకర్యాలను టీటీడీ కల్పించింది. ఆర్జిత సేవలతో పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలు అన్నీ ప్రత్యేక దర్శనాలను రద్దు చేసింది. 9 రోజుల పాటు సాగే బ్రహ్మోత్సవాలకు ఇతర జిల్లాల పోలీసులతో కలిసి కట్టుదిట్టమైన ఏర్పాట్లను జిల్లా పోలీసు యంత్రాంగం చేపట్టింది. గ్యాలరీల్లో తోపులాటలు, దొంగతనాలకు అవకాశం లేకుండా భద్రతా చర్యలు చేపట్టింది. చిన్న పిల్లలకు, వయో వృద్దులకు జియో ట్యాగింగ్ తప్పని సరి అంటున్న పోలీస్ యంత్రాంగం సీసీ కెమెరాల నిఘాను పెంచింది. ఆలయ మాఢవీధులు, తిరుపతి తిరుమల పరిసర ప్రాంతాల్లో పోలీసు బృందాలు జల్లెడ పడుతుండగా, బ్రహ్మోత్సవాల్లో పోలీసు యంత్రాంగం నిఘా పెంచింది. ఈ మేరకు డీజీపీ ద్వారకా తిరుమల రావు కూడా సమీక్ష నిర్వహించారు.

ఇక, బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టం గరుడ సేవపై టీటీడీ ప్రత్యేక దృష్టి పెట్టింది. నిర్దేశించిన సమయానికే గ్యాలరీల్లోకి భక్తులను అనుమతించనున్న టీటీడీ, భక్తులతో మర్యాద పూర్వకంగా మెలగాలని, భక్తి భావంతో కట్టుదిట్టమైన భద్రతను అందించాలని నిర్ణయించింది. ఇక బ్రహ్మోత్సవాలను గతం కంటే మిన్నగా, అత్యంత వైభవంగా నిర్వహిస్తామంటున్న టీటీడీ వాహన సేవల తోపాటు స్వామివారి దర్శనాన్ని వచ్చే భక్తులకు సంతృప్తికర దర్శనం కల్పించనుంది. ఈ మేరకు ఏర్పాట్లను టీటీడీ పూర్తి చేసింది.అన్నప్రసాదాలు, భద్రత, పరిశుభ్రత, పాలు, నీటి సదుపాయాలు రద్దీకి అనుగుణంగా ఏర్పాటు చేయనుంది. 7 లక్షల లడ్డూలను అదనంగా బఫర్ స్టాక్‌గా అందుబాటులో ఉంచనున్న టీటీడీ తెలిపింది.

ఇక కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన టీటీడీ, 1250 మంది విజిలెన్స్, 3900 మంది పోలీసులతో బ్రహ్మోత్సవాలకు భద్రత ఏర్పాటు చేసింది. భక్తుల రాకపోకలకు ఇబ్బంది లేకుండా 400 ఆర్టీసీ బస్సు భక్తులకు అందుబాటులో ఉంచింది. రోజుకు 2 వేల ట్రిపులు తిరుపతి తిరుమల మద్య నడవ నుండగా, 19 రాష్ట్రాల నుంచి వాహన సేవల ముందు కళా బృందాలు అలరించనున్నాయి. గరుడ సేవ రోజున 24 గంటల పాటు ఘాట్ రోడ్డులు తెరిచి ఉంచాలని నిర్ణయించిన టీటీడీ రెండు నడక మార్గాల్లో 24 గంటల పాటు భక్తులను కొండకు అనుమతించనుంది. గరుడ సేవకు వచ్చే యాత్రికులకు తిరుపతిలో పార్కింగ్ కోసం 5 హోల్డింగ్ పాయింట్స్‌ను అందుబాటులో ఉంచింది టీటీడీ.

బ్రహోత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తరుఫున సీఎం చంద్రబాబు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించి దర్శనం చేసుకోనున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో 2025 సంవత్సరం డైరీ, క్యాలెండరును ఆవిష్కరించనున్నారు సీఎం. అనంతరం రూ18.45 కోట్లతో పాంచజన్యం అతిథి గృహం వెనుక నిర్మించిన వకుళమాత వంటశాలను ప్రారంభిస్తారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

దురదగా ఉందని ఆస్పత్రికి వెళ్తే.. ఏకంగా ప్రాణమే పోయింది !!
దురదగా ఉందని ఆస్పత్రికి వెళ్తే.. ఏకంగా ప్రాణమే పోయింది !!
రోజుకు పది వేల అడుగులు అక్కర్లేదట !! మరి ఎన్ని అడుగులు చాలు ??
రోజుకు పది వేల అడుగులు అక్కర్లేదట !! మరి ఎన్ని అడుగులు చాలు ??
రీల్స్‌ కోసం ఇదేం పిచ్చిరా సామీ.. పట్టు తప్పితే ప్రాణాలు గాల్లోనే
రీల్స్‌ కోసం ఇదేం పిచ్చిరా సామీ.. పట్టు తప్పితే ప్రాణాలు గాల్లోనే
ఐఫోన్‌తోపాటు ఛార్జర్ ఇవ్వని కంపెనీ.. రూ.1.29 లక్షల జరిమానా
ఐఫోన్‌తోపాటు ఛార్జర్ ఇవ్వని కంపెనీ.. రూ.1.29 లక్షల జరిమానా
కూన కోసం పులితో భీకర యుద్ధం చేసిన ఎలుగుబంటి
కూన కోసం పులితో భీకర యుద్ధం చేసిన ఎలుగుబంటి
గాడిద పాల వ్యాపారం పేరుతో టోపీ.. రూ.9 కోట్లతో చెక్కేశాడు
గాడిద పాల వ్యాపారం పేరుతో టోపీ.. రూ.9 కోట్లతో చెక్కేశాడు
ఐవీఎఫ్ విధానంలో పుట్టిన పిల్లలకు గుండె జబ్బుల ముప్పు
ఐవీఎఫ్ విధానంలో పుట్టిన పిల్లలకు గుండె జబ్బుల ముప్పు
కామాంధుడైన కోటీశ్వరుడు.. 60 మందిపై ఉద్యోగినులపై అత్యాచారం
కామాంధుడైన కోటీశ్వరుడు.. 60 మందిపై ఉద్యోగినులపై అత్యాచారం
డాక్టర్స్‌ కాన్ఫరెన్స్‌లో లేడీ డ్యాన్సర్‌ చిందులు.. వీడియో వైరల్
డాక్టర్స్‌ కాన్ఫరెన్స్‌లో లేడీ డ్యాన్సర్‌ చిందులు.. వీడియో వైరల్
కంటైనర్‌లో కారు.. కారులో గుట్టలుగా నోట్ల కట్టలు
కంటైనర్‌లో కారు.. కారులో గుట్టలుగా నోట్ల కట్టలు