Weather Alert: మండుటెండల్లో ఏపీ ప్రజలకు కూల్ న్యూస్.. రానున్న మూడు రోజులు ఈ ప్రాంతాల్లో వర్షాలు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. బయటకు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. అయితే ఇలాంటి సమయంలో వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక కూల్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో రానున్న మూడు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది...
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. బయటకు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. అయితే ఇలాంటి సమయంలో వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక కూల్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో రానున్న మూడు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. మధ్య మహారాష్ట్ర నుంచి దక్షిణ తమిళనాడు వరకు ఉన్న ద్రోణి/గాలులు తెలంగాణ నుంచి దక్షిణ తమిళనాడు వరకు రాయలసీమ మీదుగా సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఈ కారణంగా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వాతావరణం ఇలా మారనుంది.
ఉత్తర కోస్తాతో పాటు యానాంలో గురువారం తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పు ఉండదని వాతావరణ శాఖ తెలిపింది. వడ గాలులు ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉందని, ఉరుముల తో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవంచే అవకాశంఉందని అధికారులు తెలిపారు. ఇక శుక్రవారం తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పు లేదు. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవంచే అవకాశంఉందని అధికారులు తెలిపారు. శనివారం విషయానికొస్తే.. తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతల్లో గణనీయమైన మార్పు లేదు. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవంచే అవకాశంఉంది. గంటకు 30 నుంచి 40 కి.మీల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తా ప్రాంతంలో గురువారం పొడి వాతావరణము ఏర్పడే అవకాశము ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పులు ఉండవు. ఇక శుక్రవారం తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతల్లో గణనీయమైన మార్పు లేదు. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవంచే అవకాశంఉందని అధికారులు తెలిపారు. ఇక శనివారం రాష్ట్రంలో పలు చోట్ల తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతల్లో గణనీయమైన మార్పు లేదు. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవంచే అవకాశంఉంది. గంటకు 30 నుంచి 40 కి.మీల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది.
ఇక రాయలసీమ విషయానికొస్తే.. గురువారం, శుక్రవారం తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత లు సాధారణ ఉష్ణోగ్రత ల కంటే 2 నండి 4డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువుగా నమోదయ్యా అవకాశం ఉంది. ఉరుముల తో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవంచే అవకాశం ఉంది. శనివారం కూడా.. తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతల్లో గణనీయమైన మార్పు ఉండదు. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవంచే అవకాశంఉంది. గంటలకు 30 నుంచి 40 కి.మీల వేగంతో ఈదుగు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..