డబ్బుల్లేక అప్పుడు ఓడిపోయా.. ఇప్పుడు కావల్సినంత డబ్బుతో పోటీకి సిద్ధం.. రాయపాటి సంచలన వ్యాఖ్యలు
మాజీ ఎంపీ, టీడీపీ నేత రాయపాటి సాంబశివరావు సంచలన వ్యాఖ్యలుచేశారు. వచ్చే ఎన్నికల్లో నరసరావుపేట ఎంపీ సీటు ఇస్తే తాను పోటీ చేయడానికి సిద్ధమని ప్రకటించారు. గతంలో డబ్బులు లేక ఓడిపోయిన తాను ఇప్పుడు కావాల్సినంత డబ్బుతో సిద్ధమైనట్టు ప్రకటించారు.
ఏపీలో సీట్ల పంచాయితీ అప్పుడే మొదలయ్యింది. మాజీ ఎంపీ, టీడీపీ నేత రాయపాటి సాంబశివరావు సంచలన వ్యాఖ్యలుచేశారు. వచ్చే ఎన్నికల్లో నరసరావుపేట ఎంపీ సీటు ఇస్తే తాను పోటీ చేయడానికి సిద్ధమని ప్రకటించారు. గతంలో డబ్బులు లేక ఎన్నికల్లో తాను ఓడిపోయానని.. అయితే ఇప్పుడు కావాల్సినంత డబ్బుతో ఎన్నికలకు సిద్ధమైనట్టు ప్రకటించారు. గుంటూరు టీడీపీ కార్యాలయంలో జరిగిన చంద్రబాబు జన్మదిన వేడుకుల్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తనకు సీటు ఇవ్వకపోయినా తన తనయుడు రంగబాబు, తన తమ్ముడి కూతురు శైలజకు టికెట్లు ఇస్తే గెలిపించుకుంటామన్నారు. రంగబాబుకు పెదకూరపాడు, సత్తెనపల్లి సీట్లలో ఎక్కడ ఇచ్చినా ఓకే అన్నారు.మాచర్ల టిక్కెట్ బ్రహ్మానందరెడ్డికి ఇస్తే కచ్చితంగా గెలుస్తాడని ధీమా వ్యక్తంచేశారు.
నరసరావుపేటలో స్థానిక అభ్యర్థినే బరిలో నిలపాలన్నారు. కడప నుంచి వచ్చి పోటీ చేస్తే నరసరావు పేటలో గెలవడం కష్టమంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. తనకు ఎంపీ టిక్కెట్ ఇవ్వకుంటే.. స్థానికుల్లో వేరేవారికి టిక్కెట్ ఇచ్చినా ఓకే అన్నారు రాయపాటి. గత కొంతకాలంగా ఇక్కడ కడప సీనియర్ నేత, మాజీ టీటీడీ ఛైర్మన్ పుట్టా సుధాకర్‌యాదవ్ తనయుడు మహేష్‌యాదవ్ ప్రచారం చేసుకుంటున్నారు. నర్సరావుపేట నుంచి పోటీచేస్తున్నట్టు ప్రచారం ఉంది. అ నేపథ్యంలోనే రాయపాటి వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి. కడప వాళ్లకు సీటు ఇవ్వొద్దంటూ రాయపాటి చేసిన కామెంట్స్ జిల్లాలో ఆసక్తిగా మారింది.
అటు కన్నా లక్ష్మీనారాయణ విషయంలోనూ రాయపాటి సంచలన వ్యాఖ్యలు చేశారు. కన్నాతో రాజీపడలేదని.. కాకపోతే పార్టీ కోసం కలిసి పనిచేస్తామన్నారు. తనతో పాటు చంద్రబాబుకు పదేళ్ల పాటు కన్నా వేధించారన్నారు. కన్నా పదేళ్లు తనను ఏడిపించారని.. చివరకు కోర్టులో రాజీపడ్డారని అన్నారు. అలాంటి వ్యక్తి కొన్ని కారణాలతో తెలుగుదేశం పార్టీలో చేరారని అన్నారు. పార్టీ నిర్ణయానికి లోబడి.. కన్నాకు ఎక్కడ టికెట్ ఇచ్చినా తాము సహకరిస్తామని రాయపాటి అన్నారు.
మరిన్ని ఏపీ వార్తలు చదవండి..