Andhra Pradesh: కదిరిలో అర్ధరాత్రి వరకూ హైడ్రామా.. సీఐ తీరుపై మండిపడుతున్న తెలుగు తమ్ముళ్లు..
శ్రీసత్యసాయి జిల్లా కదిరిలోని దేవళం బజారులో ఆక్రమణల తొలగింపు వ్యవహారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. అర్ధరాత్రి వరకూ హైడ్రామా జరిగింది. కదిరి అర్బన్ సీఐ మధు వీరంగం సృష్టించాడు. అసభ్య పదజాలంతో..
శ్రీసత్యసాయి జిల్లా కదిరిలోని దేవళం బజారులో ఆక్రమణల తొలగింపు వ్యవహారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. అర్ధరాత్రి వరకూ హైడ్రామా జరిగింది. కదిరి అర్బన్ సీఐ మధు వీరంగం సృష్టించాడు. అసభ్య పదజాలంతో మహిళలను దూషించారు. అర్ధరాత్రి దాటాక కదిరి టీడీపీ ఇన్‌చార్జ్ కందికుంటను పోలీసులు వదిలేశారు. ఉద్రిక్త పరిస్థితుల నేపధ్యంలో ఇవాళ కదిరికి జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ వెళ్లనున్నారుర. కదిరి సీఐ మధును సస్పెండ్ చేయాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. సీఐ మీసాలు తిప్పి, తొడ కొట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. సీఐ తీరు గుండాలు వ్యవహరించినట్టు ఉందని తెలుగుదేశం నేతలు ఆరోపించారు. దీంతో ఉద్రిక్త ఘటనలు చోటు చేసుకోకుండా కదిరిలో భారీగా బలగాల మోహరించాయి.
ఈ ఘటనలో పలువురు స్థానికులకు గాయాలయ్యాయి. పోలీసులు కొట్టడంతో తలపై గాయాలతో రక్తమోడుతూ కనిపించారు బాధితులు. సీఐ వీరంగాన్ని చిత్రీకరిస్తున్న మీడియాపైనా దాడికి దిగారు పోలీసులు. కొందర్నీ బూటుకాళ్లతో తన్ని తన కావరాన్ని ప్రదర్శించాడు సీఐ. పలువురిని అరెస్ట్ చేయడంతో.. వెంటనే కదిరి పోలీస్ స్టేషన్ దగ్గర బైఠాయించి నిరసన తెలియజేశారు టీడీపీ ఇంచార్జ్ కందికుంట వెంకటప్రసాద్. ఘటనలో గాయపడిన బాధితులను ప్రభుత్వ ఆస్పత్రిలో పరామర్శించారు టీడీపీ నాయకులు పరిటాల సునీత, బి.కె.పార్థసారధి, నిమ్మల కిష్టప్ప, పల్లె రఘునాథరెడ్డి.
కదిరి అర్బన్ సీఐ మధు.. మహిళా కౌన్సిలర్ పట్ల వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఎలాంటి నోటీసులు లేకుండా ఆక్రమణలు తొలగిస్తున్న వైనాన్ని కౌన్సిలర్ సుధారాణి అడ్డుకున్నారు. దీంతో అక్కడికి చేరుకున్న సీఐ మధు కౌన్సిలర్‌తో వాదనకు దిగారు. సభ్య సమాజం తలదించుకునేలా సీఐ మాటతీరు ఉండటం వివాదానికి దారి తీసింది. మహిళలను కించపరిచేలా మాట్లాడిన వారిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..