Andhra TDP: ఐదుగురు ఔట్.. అభ్యర్థులకు బీఫాంలు అందజేసిన చంద్రబాబు.. లాస్ట్ మినట్‌లో వారికి నో ఛాన్స్‌..

ఆంధ్రప్రదేశ్ టీడీపీలో అసలు ఏం జరుగుతోంది..? ఇప్పటికే పొత్తులో భాగంగా 144 అసెంబ్లీ స్థానాలు, 17 లోక్‌సభ సెగ్మెంట్లకు అభ్యర్థులను ప్రకటించింది టీడీపీ. అయితే కొన్ని నియోజకవర్గాల్లో ముందుగా ప్రకటించిన అభ్యర్థులను కాదని.. కొత్తగా మరొకరికి భీఫాంలు ఇస్తోంది. ప్రస్తుతం ఐదు స్థానాలకు అభ్యర్థులను మార్చినా..ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతుండటం పార్టీ వర్గాలకు ఆందోళన కలిగిస్తోంది..

Andhra TDP: ఐదుగురు ఔట్.. అభ్యర్థులకు బీఫాంలు అందజేసిన చంద్రబాబు.. లాస్ట్ మినట్‌లో వారికి నో ఛాన్స్‌..
TDP
Follow us

|

Updated on: Apr 21, 2024 | 4:29 PM

ఆంధ్రప్రదేశ్ టీడీపీలో అసలు ఏం జరుగుతోంది..? ఇప్పటికే పొత్తులో భాగంగా 144 అసెంబ్లీ స్థానాలు, 17 లోక్‌సభ సెగ్మెంట్లకు అభ్యర్థులను ప్రకటించింది టీడీపీ. అయితే కొన్ని నియోజకవర్గాల్లో ముందుగా ప్రకటించిన అభ్యర్థులను కాదని.. కొత్తగా మరొకరికి భీఫాంలు ఇస్తోంది. ప్రస్తుతం ఐదు స్థానాలకు అభ్యర్థులను మార్చినా..ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతుండటం పార్టీ వర్గాలకు ఆందోళన కలిగిస్తోంది.. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదివారం టీడీపీ అభ్యర్థులకు బీఫాంలు అందజేశారు. తొలుత లోక్‌సభ అభ్యర్థులకు భీఫాంలు అందజేశారు. తర్వాత అసెంబ్లీ అభ్యర్థులకు బీఫాంలు అందజేశారు. అనంతరం వారిచే చంద్రబాబు ప్రతిజ్ఞ చేయించారు. ఈ క్రమంలోనే.. అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.. ఐదు స్థానాల్లో టీడీపీ అభ్యర్థుల మార్చిన చంద్రబాబు.. ఆ ఐదుగురికి బీఫాంలు అందజేశారు.

పాడేరు నుంచి గిడ్డి ఈశ్వరికి అవకాశం కల్పించారు. వాస్తవానికి ఇక్కడ రమేష్‌నాయుడి పేరును తొలుత ప్రకటించారు. కానీ చివరకు గిడ్డి ఈశ్వరికి బీ-ఫామ్‌ దక్కింది.

అటు ఉండి టికెట్‌ రఘురామకృష్ణరాజుకు కేటాయించారు. మొదట సిట్టింగ్‌ MLA రామరాజు పేరును ప్రకటించినా, మారిన రాజకీయ పరిస్థితుల్లో రఘురామకృష్ణరాజుకే ఉండి టికెట్‌ దక్కింది.

మడకశిర టికెట్‌ ఎమ్మెస్ రాజుకు కేటాయించారు. వాస్తవానికి ఈ టికెట్‌ను ముందు- మాజీ ఎమ్మెల్యే ఈరన్న కుమారుడు డాక్టర్‌ సునీల్‌కుమార్‌కు ఇచ్చారు. ఇప్పుడు సునీల్‌కుమార్‌ స్థానంలో ఎమ్మెస్‌ రాజుకు బీ-ఫామ్‌ ఇచ్చారు.

మాడుగుల టికెట్ బండారు సత్యనారాయణమూర్తికి కేటాయించారు. పైలా ప్రసాద్‌ పేరును టీడీపీ తొలుత ప్రకటించినా, మారిన రాజకీయ సమీకరణాల ప్రకారం, మాడుగుల టికెట్‌ బండారు సత్యనారాయణమూర్తిని వరించింది.

వెంకటగిరి టికెట్‌ కురుగొండ్ల రామకృష్ణను మార్చి, ఆయన కూతురు కురుగొండ్ల లక్ష్మీసాయిప్రియకు కేటాయించారు.

అనపర్తి టికెట్‍పై వీడిన చిక్కుముడి.. బీజేపీ నుంచి నల్లమిల్లి..

తూర్పుగోదావరి జిల్లా అనపర్తి టికెట్‍పై చిక్కుముడి వీడింది. నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని బీజేపీ నుంచి పోటీ చేయించేందుకు ఒప్పించారు టీడీపీ, బీజేపీ నేతలు. అంతకుముందు టీడీపీ నుంచే పోటీ చేస్తానని పట్టబట్టారు నల్లమిల్లి. చంద్రబాబు, బుచ్చయ్యచౌదరి, బీజేపీ నేతలతో చర్చల తర్వాత.. బీజేపీ నుంచి పోటీకి నల్లమిల్లి అంగీకరించారు. చంద్రబాబు మాటే శిరోధార్యమంటూ.. త్వరలో బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. రామవరంలో బీజేపీ నాయకులతో సమావేశమైన నల్లమిల్లి.. తనకు అండగా ఉండాలని కోరారు.

అయితే, మారిన పరిస్థితులతోనే.. అభ్యర్థులను మార్పు చేసినట్లు పేర్కొంటున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..