Andhra Pradesh: వదిలిపెట్టే ప్రసక్తే లేదు.. రాష్ట్రపతితో భేటీ అనంతరం చంద్రబాబు సంచలన కామెంట్స్..
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని, తక్షణమే స్పందించిన రాష్ట్రంలో రాష్ట్రపతిపాలన పెట్టాలని ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు.
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని, తక్షణమే స్పందించిన రాష్ట్రంలో రాష్ట్రపతిపాలన పెట్టాలని ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఈ మేరకు సోమవారం నాడు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు విజ్ఞప్తి చేశారు. ఏపీలో మంగళగిరిలో గల తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ శ్రేణులు దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై కేంద్ర పెద్దలకు ఫిర్యాదు చేసేందుకుపై టీడీపీ అధినేత చంద్రబాబు నేతృత్వంలోని 18 మంది సభ్యుల బృందం సోమవారం నాడు ఢిల్లీకి వెళ్లింది. మధ్యాహ్నం సమయంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిశారు చంద్రబాబు. ఆ సందర్భంగా ఏపీలో వైసీపీ పాలన, టీడీపీ నేతలు, పార్టీ కార్యాలయాలపై జరుగుతున్న దాడులపై ఫిర్యాదు చేశారు. పోలీసులు అనుసరిస్తున్న విధానాలు, ప్రభుత్వ పాలసీలపై రాష్ట్రపతికి చంద్రబాబు కంప్లైంట్ ఇచ్చారు. ఈ మేరకు విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు.
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు.. ఏపీలో వైసీపీ ప్రభుత్వం చేస్తున్న దాష్టికాలపై నిప్పులు చెరిగారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రేరేపిత అరాచకం ఏపీలో కొనసాగుతోందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయం సహా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ కార్యాలయలపై వైసీపీ శ్రేణులు దాడులు చేయడంపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేశామన్నారు. ఏపీ కేంద్రంగానే దేశ వ్యాప్తంగా డ్రగ్స్ మాఫియా రెచ్చిపోతోందంటూ ఆరోపించారు. డ్రగ్స్ వినియోగంపై ఉక్కుపాదం మోపాలని తమ పార్టీ నేతలంటే.. టీడీపీ కార్యాలయాలపై దాడులకు తెగబడ్డారని ఆరోపించారు. రాష్ట్ర పార్టీ కార్యాలయంపై దాడి చేయడం చరిత్రలోనే తొలిసారి అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ప్రోత్సాహంతోనే ఈ దాడులు జరిగాయని, దీనిపై యాక్షన్ తీసుకోవాలని రాష్ట్రపతిని కోరామని చెప్పారు చంద్రబాబు. ఏపీలో మద్యపాన నిషేధం పేరు చెబుతూనే.. అక్రమ మద్యాన్ని ప్రోత్సహిస్తున్నారంటూ రాష్ట్ర ప్రభుత్వంపై బాబు ఫైర్ అయ్యారు.
రాష్ట్రంలో రెండేళ్లుగా అరాచక పాలన సాగుతోందని, రాజ్యాంగ వ్యవస్థలను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారని చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మాట్లాడే స్వేచ్ఛ, ప్రశ్నించే హక్కు లేదని అన్నారు. ప్రశ్నిస్తే దాడులకు తెగబడుతున్నారంటూ వైసీపీ ప్రభుత్వ విధానాలపై చంద్రబాబు ఫైర్ అయ్యారు. ఏపీలో ఇలాంటి భయంకరమైన పరిస్ధితులు ఉన్నందునే 356 ఆర్టికల్‌ను విధించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. దాడుల ఫోటోలు, వీడియోలు చూసి రాష్ట్రపతి కూడా షాక్ అయ్యారని చంద్రబాబు పేర్కొన్నారు. ఏపీలో పోలీసు వ్యవస్థ భ్రష్టుపట్టిందన్న చంద్రబాబు.. ఈ దాడుల ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని రాష్ట్రపతిని కోరామన్నారు. తమకు న్యాయం జరిగే వరకు, నిందితులకు కఠిన శిక్ష పడే వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఉద్ఘాటించారు టీడీపీ అధినేత చంద్రబాబు.
Also read:
The Ashes: గుడ్ న్యూస్ చెప్పిన స్టార్ ఆల్ రౌండర్.. ఆ సిరీస్‌కు సిద్ధమంటూ సిగ్నల్
Afghan Crisis: డబ్బులకు బదులు గోధుమలు…తాలిబన్ల కొత్త నిర్ణయం