AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Afghan Crisis: డబ్బులకు బదులు గోధుమలు…తాలిబన్ల కొత్త నిర్ణయం

కొన్ని నెలల క్రితం వరకు అభివృద్ధి వైపు మెల్లిమెల్లిగా అడుగులేసిన అఫ్గానిస్తాన్‌ ఇప్పుడు ఆర్థిక.....

Afghan Crisis: డబ్బులకు బదులు గోధుమలు...తాలిబన్ల కొత్త నిర్ణయం
Basha Shek
|

Updated on: Oct 25, 2021 | 3:50 PM

Share

కొన్ని నెలల క్రితం వరకు అభివృద్ధి వైపు మెల్లిమెల్లిగా అడుగులేసిన అఫ్గానిస్తాన్‌ ఇప్పుడు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. నిరుద్యోగం, ఆకలి కేకలతో అక్కడి ప్రజలు అల్లాడుతున్నారు. ఇటీవల పశ్చిమ కాబూల్‌లో ఎనిమిది మంది చిన్నారులు ఆకలితో చనిపోవడం అక్కడి దీన పరిస్థితులకు అద్దం పడుతోంది. ఈ క్రమంలో అఫ్గాన్‌ ప్రజలను ఆదుకునేందుకు అక్కడి తాలిబన్ ప్రభుత్వం తాజాగా ఓ కొత్త కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. నిరుద్యోగం, ఆకలి చావులను నిరోధించేందుకు గాను ‘పనికి గోధుమల పంపిణీ’ని ప్రారంభించింది. అంటే పని చేసిన వారికి వేతనం బదులుగా గోధుమలను పంపిణీ చేయనుంది. ఆకలి చావులను అరికట్టేందుకే! ఇప్పటికే పేదరికం, కరువు, కరెంటు కోతలు..తదితర సమస్యలతో కుదేలవుతోన్న అఫ్గాన్‌ ప్రజలకు శీతాకాలం మరిన్ని సమస్యలు తెచ్చిపెట్టింది. ఈ నేపథ్యంలో తాలిబన్లు ముందు జాగ్రత్తగానే ఈ గోధుమల పంపిణీని ప్రారంభించారు. అఫ్గాన్‌ రాజధాని కాబూల్‌లో తాలిబన్ల అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్‌ అధికారికంగా గోధుమల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అఫ్గాన్‌ వ్యవసాయ మంత్రి అబ్దుల్‌ రెహ్మాన్‌ రషీద్‌, కాబూల్‌ మేయర్‌ హమ్‌దుల్లా నొమాని తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాబూల్‌లోనే కాకుండా హెరాత్‌, జలాలాబాద్‌, కాందహార్‌, మజారే షరీఫ్‌ తదితర నగరాలు, పట్టణాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తాలిబన్లు తెలిపారు. అదేవిధంగా కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు విస్తృతంగా కాలువల నిర్మాణం చేపడతామన్నారు.

Also Read:

అదిరిపోయే ఆఫర్‌..చికెన్‌, లాలిపాప్స్‌ తింటే చాలు లక్ష జీతం.. ఎక్కడో తెలుసా..?

Coronavirus: అమ్మో చైనా మళ్ళీ భయపెడుతోంది..వేగంగా పెరుగుతున్న కరోనా కేసులతో కొన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్..కఠిన ఆంక్షలు

Powerful Passport: ప్రపంచంలో శక్తివంతమైన పాస్‌పోర్టులివే.. ఇండియా ఎన్నో స్థానంలో ఉందంటే…