AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

The Ashes: గుడ్‌ న్యూస్ చెప్పిన స్టార్ ఆల్ రౌండర్.. ఆ సిరీస్‌‌కు సిద్ధమంటూ సిగ్నల్

England: ఇంగ్లండ్ టీంకు యాషెస్ సిరీస్‌ ముందు ఓ శుభవార్త అందింది. అలాగే 11 సంవత్సరాలలో మొదటిసారి ఆస్ట్రేలియాలో యాషెస్ సిరీస్‌ గెలవాలనే ఇంగ్లండ్ ఆశలకు పెద్ద ఊతమిచ్చినట్లయింది.

The Ashes: గుడ్‌ న్యూస్ చెప్పిన స్టార్ ఆల్ రౌండర్.. ఆ సిరీస్‌‌కు సిద్ధమంటూ సిగ్నల్
Ben Stokes
Venkata Chari
|

Updated on: Oct 25, 2021 | 4:04 PM

Share

Ben Stokes: బెన్ స్టోక్స్ నాలుగున్నర నెలల విరామం తర్వాత క్రికెట్‌లోకి తిరిగి వస్తున్నట్లు సిగ్నల్ ఇచ్చాడు. దీంతో ఇంగ్లండ్ టీంకు యాషెస్ సిరీస్‌ ముందు ఓ శుభవార్త అందింది. అలాగే 11 సంవత్సరాలలో మొదటిసారి ఆస్ట్రేలియాలో యాషెస్ సిరీస్‌ గెలవాలనే ఇంగ్లండ్ ఆశలకు పెద్ద ఊతమిచ్చినట్లయింది.

స్టోక్స్ జులై 26న నార్తర్న్ సూపర్‌చార్జర్స్‌ మ్యాచులో హండ్రెడ్‌లో గాయం కారణంగా తప్పుకున్నాడు. ఆ తరువాత నుంచి అతను తన మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ భారత్‌తో మొదటి టెస్టుకు కొన్ని రోజుల ముందు ఇంగ్లండ్ జట్టు నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. అలాగే టీ 20 ప్రపంచ కప్ ఎంపికలోనూ స్టోక్స్ పేరు కనిపించలేదు.

కానీ, స్టోక్స్ ఎడమ చూపుడు వేలుకు తదుపరి శస్త్రచికిత్స చేయించుకున్న తర్వాత ఏప్రిల్‌లో ఐపీఎల్‌లో కొన్ని మ్యాచులో మాత్రమే ఆడాడు. అయితే ఆ గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదు. ప్రస్తుతం స్టోక్స్ మానసిక ఆరోగ్యంతో గాయాల నుంచి పూర్తిగా కోలుకున్నట్లు తెలుస్తోంది. నవంబర్ 4 న ఆస్ట్రేలియాకు బయలుదేరే జట్టుతో చేరనున్నాడు.

“నా మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడానికి నేను విరామం తీసుకున్నాను. నా వేలిని గాయం పూర్తిగా నయమైంది” అని స్టోక్స్ పేర్కొన్నాడు. “నేను నా సహచరులతో మైదానంలో అడుగుపెట్టేందుకు ఎంతగానో ఎదురుచూస్తున్నాను. నేను ఆస్ట్రేలియాతో సిరీస్‌కు సిద్ధంగా ఉన్నాను” అని ప్రకటించాడు.

ఈ మేరకు ఇంగ్లండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆష్లే గిల్స్ మాట్లాడుతూ, “గత కొన్ని వారాలుగా స్టోక్స్ వేలికి చేసిన ఆపరేషన్‌ విజయవంతమైంది. మా వైద్య సిబ్బంది, అతని మేనేజ్‌మెంట్ టీం మధ్య అనేక చర్చలు జరిగాయి. బెన్ నాకు సిద్ధంగా ఉన్నాను అని నాకు ఫోన్ చేసి చెప్పాడు. క్రికెట్‌కి తిరిగి రావడం, ముఖ్యంగా యాషెస్ సిరీస్‌లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని సంతోషిస్తున్నాను” అని తెలిపాడు.

జులైలో పాకిస్తాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో స్టోక్స్ చివరిసారిగా ఇంగ్లండ్ తరఫున ఆడాడు. బెన్ స్టోక్స్, ఇయాన్ మోర్గాన్‌తో పాటు మిగిలిన జట్టును అనేకమార్లు కోవిడ్ -19 టెస్టుల నిర్వహించి పాజిటివ్‌గా తేలిన తరువాత జట్టులో చేరాడు. పాక్ సిరీస్‌లో రెండుసార్లు బ్యాటింగ్ చేశాడు. కొన్ని ఓవర్లు బౌలింగ్ కూడా చేశాడు. దీంతోనే ఇంగ్లండ్ టీం పాకిస్తాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను 3-0తో గెలుచుకుంది.

ఈ నెల ప్రారంభంలో ఇంగ్లండ్ టీం యాషెస్ జట్టును ప్రకటించింది. స్టోక్స్ గైర్హాజరు, ప్రధాన కోచ్ క్రిస్ సిల్వర్‌వుడ్‌ల పునరాగమనంపై ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదు. అనంతరం స్టోక్స్ టీంను ప్రకటించిన ఒక రోజు తర్వాత బ్యాట్ హ్యాండిల్‌ను పట్టుకున్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. శస్త్రచికిత్స తర్వాత నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున వీడియోను పంచుకున్నాడు. గత వారం అతను బౌలింగ్ చేస్తున్న ఫుటేజీని కూడా ట్వీట్ చేశాడు.

ఇంగ్లండ్ యాషెస్ ప్లానింగ్‌లో భాగంగా ఇప్పటికే వారి ఇద్దరు వేగవంతమైన బౌలర్లు – జోఫ్రా ఆర్చర్, ఒల్లీ స్టోన్ గాయంతో తీవ్రంగా నష్టపోయింది. స్టోక్స్ పునరాగమనం జట్టును అన్ని విభాగాల్లో బలోపేతం చేస్తుందనడంలో సందేహం లేదు. ప్రస్తుతం జట్టులో ముగ్గురికి మాత్రమే ఆస్ట్రేలియాలో టెస్ట్ అనుభవం ఉంది.

స్టోక్స్ ఎనిమిది సంవత్సరాల క్రితం ఆస్ట్రేలియాలో తన టెస్ట్ అరంగేట్రం చేశాడు. పెర్త్‌లో తన రెండవ ప్రదర్శనలో సెంచరీ సాధించాడు. అయితే బ్రిస్టల్ నైట్‌క్లబ్ వెలుపల గొడవలో పాల్గొన్న తర్వాత 2017-18 యాషెస్‌ సిరీస్‌ నుంచి తప్పించారు.

Also Read: Indian Cricket Team: ప్రతీ మ్యాచ్ గెలవాల్సిందే.. లేదంటే కోహ్లీసేన దుకాణ్ బంద్.. సెమీఫైనల్ అవకాశాలు ఎలా ఉన్నాయంటే..?

IPL 2022: నేడే కొత్త జట్ల ప్రకటన.. పోటీలో అదానీ నుంచి మాంచెస్టర్ యునైటెడ్ వరకు.. ఐపీఎల్ 2022 ఎలా మారనుందో తెలుసా?