MP Rammohan Naidu: నవరత్నాలు కావవి.. బూడిద రత్నాలు.. బూతులు తిట్టడంలో పోటీ పడుతున్నారు

బూడిద రత్నాలను నవరత్నాలుగా ప్రచారం చేసుకుంటూ వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజ‌ల‌ను మ‌భ్యపెడుతోంద‌ని టీడీపీ ఎంపీ

MP Rammohan Naidu: నవరత్నాలు కావవి.. బూడిద రత్నాలు.. బూతులు తిట్టడంలో పోటీ పడుతున్నారు
Rammohan Naidu
Follow us
Venkata Narayana

|

Updated on: Oct 04, 2021 | 1:38 PM

TDP MP Rammohan Naidu: బూడిద రత్నాలను నవరత్నాలుగా ప్రచారం చేసుకుంటూ వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజ‌ల‌ను మ‌భ్యపెడుతోంద‌ని టీడీపీ ఎంపీ రామ్మోహ‌న్ నాయుడు మండిప‌డ్డారు. 22 మంది ఎంపీలు ఉన్నప్పటికీ వైసీపీ.. ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురాలేక‌పోతోంద‌ని ఆయ‌న విమ‌ర్శించారు. ఈ రోజు ఆయ‌న కృష్ణా జిల్లా గుడివాడలో మీడియా సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

ప్రజా సేవ చేయడం మాని.. సీఎం జగన్ కు 24 గంటలూ భజన చేయడం.. ప్రతిపక్షాలను బూతులు తిట్టడంలో మాత్రం వైసీపీ నాయ‌కులు పోటీ పడుతున్నారని రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యానించారు. కొడాలి నానికి టీడీపీ రాజకీయ భిక్ష పెట్టింద‌ని, అటువంటిది త‌మ పార్టీకి ఆయ‌న‌ వెన్నుపోటు పొడిచార‌ని ఆక్షేపించారు. రానున్న రోజుల్లో కొడాలి నానికి గుణపాఠం తప్పదని రామ్మోహన్ నాయుడు జోస్యం చెప్పారు.

ఆంధప్రదేశ్ ప్రజల్లో ఇప్పటికే మార్పు మొదలైందని.. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి ఓట‌మి తప్పదని రామ్మోహ‌న్ నాయుడు అన్నారు. ప్రతి దానిపై ఏపీ ప్రభుత్వం పన్ను వేసి మధ్య తరగతి ప్రజలను ఇబ్బందుల‌కు గురి చేస్తోంద‌ని.. ప్రభుత్వ చేపడుతోన్న అన్ని కార్యక్రమాల్లో భారీ అవినీతి రాజ్యమేలుతోందని రామ్మోహన్ నాయుడు ఆరోపించారు.

Read also: Prakash Raj: సాయాలు, చందాలు, ఉచితాలతోనే బ్రతుకుదామా.? మంచు విష్ణు ప్యానల్ పై ప్రకాష్ రాజు సెటైర్లు