Prakash Raj: సాయాలు, చందాలు, ఉచితాలతోనే బ్రతుకుదామా.? మంచు విష్ణు ప్యానల్ పై ప్రకాష్ రాజు సెటైర్లు

Venkata Narayana

Venkata Narayana |

Updated on: Oct 04, 2021 | 1:21 PM

'మా' మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు రోజురోజుకూ మరింత రసవత్తరంగా మారుతున్నాయి. సినీ ఇండస్ట్రీలో సరికొత్త సమీకరణాలకు

Prakash Raj: సాయాలు, చందాలు, ఉచితాలతోనే బ్రతుకుదామా.? మంచు విష్ణు ప్యానల్ పై ప్రకాష్ రాజు సెటైర్లు
Prakash Raj

Follow us on

Prakash Raj – Manchu Vishnu – MAA Elections: ‘మా’ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు రోజురోజుకూ మరింత రసవత్తరంగా మారుతున్నాయి. సినీ ఇండస్ట్రీలో సరికొత్త సమీకరణాలకు వేదికలవుతున్నాయి. ‘మా’ ఎన్నికల హడావుడి సాధారణ ఎన్నికలను తలదన్నేలా కనిపిస్తోంది. ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ వ్యవహారం హాట్‌ హాట్‌గా మారుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రత్యర్థులు చాలెంజ్‌లు విసురుకుంటూ ఎన్నికల వేడిని పెంచేస్తున్నారు. ఇప్పటికే దూకుడుగా వెళ్తోన్న ప్రకాష్ రాజ్ ఇవాళ మరో అడుగు ముందుకేశారు. హాటైన వ్యాఖ్యలు చేశారు. ఎప్పటికీ సాయాలు, చందాలు, ఉచితాలతోనే బ్రతుకుదామా? అంటూ ఆయన మా అసోసియేషన్ సభ్యుల్ని ప్రశ్నించారు. ఆల్ లైట్స్.. యాక్షన్ లతో పనిచేస్తూ జీవిద్దామా..? తేల్చుకోండంటూ ఆయన సభ్యుల్ని అడిగే ప్రయత్నం చేశారు.

అడుగు, ఆలోచన, ఆచరణ… “మా” కోసం, మా సభ్యుడి క్షేమం కోసం అనే తాజా నినాదాన్ని తీసుకొచ్చారు ప్రకాష్ రాజ్. ఇక, తాజాగా టీవీ9లో నిర్వహించిన ఫ్లాష్‌ పాయింట్‌ కార్యక్రమంలో పాల్గొన్న ప్రకాశ్‌ రాజ్‌ మంచు విష్ణుపై పలు సెన్సేషన్‌ కామెంట్స్‌ చేశారు. పవన్‌ కళ్యాణ్‌ పేరును మా ఎన్నికల్లోకి లాగడంపై స్పందించిన ప్రకాశ్‌ రాజ్‌.. పవన్‌ గురించి మాట్లాడేప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని తెలిపారు. ప్రకాశ్‌ ఎటువైపు ఉన్నారు అని ప్రశ్నిస్తున్నారని.. మా ఎన్నికల్లోకి చిరంజీవి, కృష్ణ లాంటి పెద్ద వారిని ఎందుకు లాగుతున్నారని అసహనం వ్యక్తం చేశారు.

అంతేకాకుండా, పవన్ కళ్యాణ్ పేరును కూడా మా ఎన్నికల్లోకి లాగడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ప్రకాశ్ రాజ్.. మీ సినిమాల మొత్తం బడ్జెట్ కలిపినా పవన్ కళ్యాణ్ సినిమాల మార్నింగ్ షో కలెక్షన్స్ అంత ఉండదు. అలాంటిది మీరు ఆయన గురించి మాట్లాడటం ఏంటంటూ ప్రకాశ్‌ రాజ్‌ విమర్శించారు. మరి మా ఎన్నికలు పూర్తయ్యేలోపు ఈ వ్యవహారం ఇంకెన్ని మలుపులు తిరుగుతాయో చూడాలి. ఈ క్రమంలోనే ఇప్పటికే పోటీ నుంచి బండ్ల గణేశ్‌ తప్పుకోగా.. ఇప్పుడు పోటీ ఇటు ప్రకాశ్‌ రాజ్‌ విష్ణుల మధ్యే మారింది. ఇందులో భాగంగానే వీరిద్దరి మధ్య మాటల యుద్ధం పెరుగుతోంది.

కాగా, ఇవాళ రెబల్ స్టార్ కృష్ణంరాజును కలిసిన మంచు విష్ణు, కృష్ణం రాజు బ్లెస్సింగ్స్ తీసుకున్నట్టు ట్వీట్ చేశారు.

Read also: Konda movie: ‘కొండా’ మూవీ పోస్టర్స్ రిలీజ్ చేసిన రామ్ గోపాల్ వర్మ

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu