TDP: ‘నేను సపోర్ట్ చేయను’.. ఎమ్మెల్యేకు నిర్మొహమాటంగా చెప్పిన మాజీ ఎమ్మెల్యే
మూడేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే శివరామరాజు.. ఇటీవలి కాలంలో పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ వచ్చారు. తరచూ నియోజకవర్గంలో పర్యటిస్తూ సేవా కార్యక్రమాలు చేపట్టారు.. గత ఎన్నికల్లో పార్లమెంట్‌కు పోటీ చేసినంత మాత్రాన తను సిట్టింగ్ కాకుండా పోనని.. ఉండి ప్రజల ఆశీర్వాదంతో ఈసారి ఎన్నికల్లో పోటీ చేసేది తానేనని శివరామరాజు చెబుతూ వచ్చారు. కానీ..
ఉండి టీడీపీ రాజకీయం ఇప్పుడు హాట్ టాఫిక్‌గా మారింది..పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజక వర్గం టీడీపీలో ఎమ్మెల్యే రామరాజు, మాజీ ఎమ్మెల్యే శివరామరాజు వర్గాలు ఉన్నాయి. వారివురూ టికెట్ కోసం అన్ని ప్రయత్నాలు చేశారు. పలు అంశాలను బేరీజు వేసిన హైకమాండ్… వారిలో ఎమ్మెల్యే రామరాజుకు అధిష్టానం ఉండి టిడిపి సీటును కేటాయించింది.. దీంతో మాజీ MLA శివరామరాజు ఆగ్రహించారు. అప్పట్నుంచి పార్టీకి అంటిముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. అయితే ఇవాళ భీమవరంలోని శివరామరాజు ఆఫీస్‌కి MLA రామరాజు వచ్చి మద్దతు కోరగా ఆయన నిరాకరించారు. సపోర్ట్ చేసేది లేదంటూ శివరామరాజు తేల్చిచెప్పడంతో ఎమ్మెల్యే రామరాజు అక్కడి నుంచి వెనుదిరిగాల్సి వచ్చింది…
మూడేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే శివరామరాజు.. ఇటీవలి కాలంలో పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ వచ్చారు. తరచూ నియోజకవర్గంలో పర్యటిస్తూ సేవా కార్యక్రమాలు చేపట్టారు.. గత ఎన్నికల్లో పార్లమెంట్‌కు పోటీ చేసినంత మాత్రాన తను సిట్టింగ్ కాకుండా పోనని.. ఉండి ప్రజల ఆశీర్వాదంతో ఈసారి ఎన్నికల్లో పోటీ చేసేది తానేనని శివరామరాజు చెబుతూ వచ్చారు. టీడీపీ-జనసేన పొత్తులో భాగంగా రెండు రోజుల క్రితం సీట్లు ప్రకటించగా..ఉండి ఎమ్మెల్యే అభ్యర్థిగా మళ్లీ రామరాజుకే టికెట్ కేటాయించింది అధిష్టానం.. దీంతో టీడీపీ వైఖరిపట్ల కన్నీరు పెట్టుకున్నారు శివరామరాజు.. పార్టీనే నమ్ముకుని ఉన్న తనకు టికెట్ ఇవ్వకపోవడం దారుణమన్నారు. పార్టీకి సేవచేస్తే తనను నడిరోడ్డుపై వదిలిపెట్టారంటూ బాధపడ్డారు. కచ్చితంగా తాను ఎన్నికల బరిలో ఉంటా అంటూ స్పష్టం చేశారు శివరామరాజు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…