Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కేంద్రం ‘మరో ఆలోచన’.. పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు
విశాఖ స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్‌పై ఏపీ బీజేపీ రాష్ట్రాధ్యక్షురాలు పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు బదులు లాభాల బాటలోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. స్టీల్ ప్లాంట్‌కు సంబంధించిన వివరాలను కేంద్ర ఉక్కు శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింథియా మూడురోజులకు ఒకసారి వివరాలు తెప్పించుకుంటున్నారని చెప్పారు.
విశాఖ స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్‌పై ఏపీ బీజేపీ రాష్ట్రాధ్యక్షురాలు పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు బదులు లాభాల బాటలోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. స్టీల్ ప్లాంట్‌కు సంబంధించిన వివరాలను కేంద్ర ఉక్కు శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింథియా మూడురోజులకు ఒకసారి వివరాలు తెప్పించుకుంటున్నారని చెప్పారు. అలాగే విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు విషయంలోనూ కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని చెప్పారు. రైల్వే జోన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్థలం ఇవ్వలేదని, అందుకే ఆలస్యం అవుతోందన్నారు. రైల్వే జోన్‌కు భూములు ఇవ్వాలని స్వయంగా రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఏపీ ప్రభుత్వాన్ని కోరినట్లు తెలుస్తోంది. భూములు ఇవ్వకపోగా కేంద్ర ప్రభుత్వాన్ని ఈ విషయంలో నిందించడం సరికాదన్నారు. ఆంధ్రాలో ఒకసారి, కేంద్రంలో మరోసారి అనేదే తమ నినాదంగా పురందేశ్వరి పేర్కొన్నారు.