Andhra Pradesh: ఎమ్మెల్యేలు కోర్టుకు వెళ్లినా.. నా నిర్ణయమే ఫైనల్.. స్పీకర్ తమ్మినేని సీతారాం కామెంట్స్

టీడీపీకి చెందిన నలుగురు రెబల్ ఎమ్మెల్యేలు, వైసీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తూ ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద వారిపై ఈ నిర్ణయం తీసుకున్నారు స్పీకర్. కాగా 8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తర్వాత తొలిసారి టీవీ9తో స్పందించారు స్పీకర్ తమ్మినేని.

Andhra Pradesh: ఎమ్మెల్యేలు కోర్టుకు వెళ్లినా.. నా నిర్ణయమే ఫైనల్.. స్పీకర్ తమ్మినేని సీతారాం కామెంట్స్

|

Updated on: Feb 27, 2024 | 6:56 PM

టీడీపీకి చెందిన నలుగురు రెబల్ ఎమ్మెల్యేలు, వైసీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తూ ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద వారిపై ఈ నిర్ణయం తీసుకున్నారు స్పీకర్. కాగా 8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తర్వాత తొలిసారి టీవీ9తో స్పందించారు స్పీకర్ తమ్మినేని. వైసీపీ ప్రభుత్వంలో ఫిరాయింపులకు స్థానం లేదని స్పష్టం చేశారు.  పార్టీ ఫిరాయింపులకు పాల్పడితే వేటు తప్పదంటూ స్పీకర్ హెచ్చరించారు. ఎమ్మెల్యేలకు సమయం ఇచ్చినా విచారణకు హాజరుకాలేదని, దీంతో  వారిపై అనర్హత వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అసెంబ్లీ స్పీకర్‌గా తనకున్న విచక్షణా అధికారం మేరకే నిర్ణయం తీసుకున్నానని తెలిపారు.  ఎమ్మెల్యేలు న్యాయస్థానాలకు వెళ్లినా.. తాను తీసుకున్న నిర్ణయమే ఫైనల్ అన్నారు స్పీకర్.

వైసీపీ ఫిర్యాదు మేరకు ఆ పార్టీకి చెందిన నలుగురు రెబల్ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిపై స్పీకర్ వేటు వేశారు.  టీడీపీ ఫిర్యాదుతో వాసుపల్లి గణేష్, వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాల గిరిలపై అనర్హత వేటు పడింది.

Follow us