Pattabhi: ఎయిర్‌పోర్ట్‌లో పట్టాభి.. ఎక్కడికి వెళ్లారంటే.. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి

బెయిల్ అనంతరం పట్టాభి ఎవరికీ కనిపించలేదు. అజ్ఞాతంలోకి ఉంటూ వస్తున్నారు. ఆయన ఎక్కడ ఉన్నారనే సమాచారం తెలియలేదు. 

Pattabhi: ఎయిర్‌పోర్ట్‌లో పట్టాభి.. ఎక్కడికి వెళ్లారంటే.. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి
Pattabhi
Follow us
Ram Naramaneni

|

Updated on: Oct 25, 2021 | 6:36 PM

ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో టీడీపీ నేత పట్టాభి మాల్దీవులకు వెళ్లినట్లు తెలుస్తోంది. రెండు రోజుల కిందటే ఆయన రాజమండ్రి సెంట్రల్‌ జైలు నుంచి బెయిల్‌పై బయటకు వచ్చారు. సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్ట్‌ అయిన విషయం తెలిసిందే. ఆపై విజయవాడ కోర్టులో ప్రవేశపెట్టగా… న్యాయస్థానం ఆయనకు 14 రోజుల రిమాండ్‌ విధించింది. దీనితో పోలీసులు ఆయనను మచిలీపట్నం సెంట్రల్ జైలుకు తరలించారు. రిమాండ్ ఖైదీగా ఉన్న పట్టాభికి ఏపీ హైకోర్టు ఆయనకు శనివారం బెయిల్ ఇచ్చింది. ప్రజంట్ పట్టాభి ఎయిర్‌పోర్టులో, ఫ్లైట్‌లో ఉన్న ఫొటోలు వైరల్‌ అయ్యాయి. దీంతో దేశం వదిలి పారిపోతున్న పట్టాభి అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

బెయిల్ అనంతరం పట్టాభి ఎవరికీ కనిపించలేదు. అజ్ఞాతంలోకి ఉంటూ వస్తున్నారు. ఆయన ఎక్కడ ఉన్నారనే సమాచారం తెలియలేదు.  మీడియా ముందుకు గానీ..జనం ముందుకు గానీ..చివరికి పార్టీ నాయకులకు కూడా అందుబాటులోకి రాలేదు. తాజా ఫోటోలతో పట్టాభి దేశం విడిచి వెళ్లినట్లు తెలుస్తోంది.

పట్టాభి అన్న ఒకే ఒక్క మాటతో రాష్ట్రంలో తీవ్ర దుమారం

సీఎం జగన్‌ను ఉద్దేశించి పట్టాభి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో తీవ్ర ఉద్రిక్తలు తలెత్తాయి. వైఎస్ జగన్‌ను ఉద్దేశించి ఓ పదాన్ని ఉపయోగించడంతో వైసీపీ నాయకులు, కేడర్ పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు దిగారు. పరిస్థితులు అదుపుతప్పింది. టీడీపీ కేంద్ర కార్యాలయంపైనా దాడులకు దిగే వరకు వచ్చింది. దీన్ని నిరసిస్తూ టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏకంగా 36 గంటల పాటు దీక్ష చేయాల్సి వచ్చింది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను పెట్టాలని కోరారు.

కాగా పట్టాభి మాల్దీవులు వెళ్లారనే ప్రచారంపై స్పందించారు టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ. దేశం విడిచి వెళ్లిపోయేంత నేరాలేవీ పట్టాభిపై లేవన్నారు. పాత ఫోటోలను సర్కులేట్ చేస్తున్నారేమో అని అనుమానం వ్యక్తం చేశారు.

Also Read: షమీకి వ్యతిరేకంగా జాత్యహంకార వ్యాఖ్యలు.. మండిపడ్డ సెహ్వాగ్

 రిజ్వాన్​ మాములోడు కాదు.. పక్కా ప్లానింగ్‌తో వచ్చాడు.. షాకింగ్ వీడియో రిలీజ్ చేసిన ఐసీసీ