Sacred Heart School: టీవీ9 చొరవ.. నెరవేరిన వందలాది మంది విద్యార్థుల కోరిక
ప్రజల సమస్యలు పరిష్కరించే విషయంలో టీవీ9 ఎప్పుడూ ముందు ఉంటుంది. ఇది మరోసారి రుజువైంది. టీవీ9 చొరవతో వందలాది మంది విద్యార్థుల కోరిక నెరవేరింది.
Sacred Heart School – Visakhapatnam: ప్రజల సమస్యలు పరిష్కరించే విషయంలో టీవీ9 ఎప్పుడూ ముందు ఉంటుంది. ఇది మరోసారి రుజువైంది. టీవీ9 చొరవతో వందలాది మంది విద్యార్థుల కోరిక నెరవేరింది. టీవీ9 వరుస కథనాలతో దిగొచ్చారు అధికారులు. దీంతో విశాఖలోని సెక్రెడ్ హార్ట్ స్కూల్ వివాదం ముగిసింది. పాఠశాలను యథావిధిగా కొనసాగిస్తామని ప్రకటించారు ఫాదర్ రత్నాకర్. తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదనీ.. ప్రభుత్వంతో చర్చలు జరిపామనీ స్పష్టం చేసింది యాజమాన్యం.
ప్రభుత్వ విలీన ప్రతిపాదనతో అంగీకరించబోమని.. అలా చేయాల్సి వస్తే ఏకంగా స్కూలును మూసేయాలని నిర్ణయించుకున్నాయి కొన్ని యాజమాన్యాలు. విశాఖలోని సెక్రెడ్ స్కూల్ కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకుంది. దీనిపై ఆందోళనకు దిగారు విద్యార్థులు, తల్లిదండ్రులు. విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారడంతో ధర్నాకు దిగారు తల్లిదండ్రులు. అయితే, పాఠశాలను కొనసాగిస్తామని ఫాదర్ రత్నాకర్ చెప్పగా, ఆందోళన విరమించారు పేరేంట్స్.
కాగా, విశాఖలో సేక్రెడ్ హార్ట్ ఎయిడెడ్ బాలికోన్నత పాఠశాలకు ఎంతో పేరుంది. దాదాపు 30 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ పాఠశాలలో జ్ఞానాపురం, కంచరపాలెం, అల్లిపురం, రైల్వే న్యూకాలని, కొబ్బరితోట, పూర్ణామార్కెట్ ప్రాంతాలకు చెందిన వందల మంది పేద విద్యార్థినులు చదువుకుంటున్నారు. స్కూలు విషయంలో స్థానిక ఎమ్మెల్యే వాసుపల్లిను అడ్డుకుని నిరసన తెలిపారు తల్లిదండ్రులు.
Read also: Srikanth Reddy: మోడీ అంతు తేలుస్తానన్న వ్యక్తి.. సాష్టాంగ నమస్కారాలు చేస్తున్నారు: శ్రీకాంత్ రెడ్డి