Srikanth Reddy: మోడీ అంతు తేలుస్తానన్న వ్యక్తి.. సాష్టాంగ నమస్కారాలు చేస్తున్నారు: శ్రీకాంత్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇచ్చిన ప్రజాతీర్పుని గౌరవించకుండా వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర చేస్తున్నారని ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి
Anam Ramnarayana Reddy: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇచ్చిన ప్రజాతీర్పుని గౌరవించకుండా వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర చేస్తున్నారని ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. సీఎం వైయస్ జగన్ మీద ఉద్దేశపూర్వకంగానే చంద్రబాబు దుర్భాషలాడించారని ఆనం ఆరోపించారు. చంద్రబాబును శాశ్వతంగా రాజకీయాల నుంచి తొలగించాలని ఆనం డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రజల సంతకాలతో సేకరించిన లేఖను జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబుకు అందజేసి గవర్నర్‌కు పంపాలని కోరారు.
సభ్య సమాజం చంద్రబాబు వైఖరిని తప్పు పడుతోందన్న ఆనం.. రాజకీయ మనుగడ కోసం దిగజారి వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. జనాగ్రహ దీక్షలో టీడీపీకి తీరుకి నిరసనగా గవర్నర్ లేఖ కోసం సంతకాలు సేకరించామని ఆయన వెల్లడించారు. మరోవైపు, చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై సెటైర్లు పేల్చారు ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి. మోడీ అంతు తేలుస్తానన్న వ్యక్తి సాష్టాంగ నమస్కారాలు చేస్తున్నారని విమర్శించారు. ఏదో రకంగా వార్తల్లో ఉండాలని ప్రయత్నించే వ్యక్తి చంద్రబాబు అని ఆరోపించారు.
మొత్తానికి ఇవాళ ఏపీ పాలిటిక్స్ ఢిల్లీని తాకాయి. తెలుగుదేశం పార్టీపై వైసీపీ దాడుల్ని ప్రెసిడెంట్‌కి ఫిర్యాదు చేసిన చంద్రబాబు రాష్ట్రపతి పాలనకు విఙ్ఞప్తి చేశారు. అయితే వైసీపీ మాత్రం టీడీపీది హైడ్రామా అంటూ కౌంటర్ ఎటాక్‌కి దిగింది.
Read also: MLA Karanam Dharmasri: సింగర్ అవతారమెత్తిన చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ