మరో వివాదంలో చిక్కుకున్న మాజీ ఎమ్మెల్యే.. అరెస్ట్‌కు సిద్ధమైన పోలీసులు.. మూడోసారి అజ్ఞాతంలోకి..

Tdp Leader: టీడీపీ, నేత, మాజీ ప్రభుత్వ విప్ కూన రవికుమార్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆయనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. రవి కుమార్‌ కోసం గాలిస్తున్నారు.

మరో వివాదంలో చిక్కుకున్న మాజీ ఎమ్మెల్యే.. అరెస్ట్‌కు సిద్ధమైన పోలీసులు.. మూడోసారి అజ్ఞాతంలోకి..
Kuna Ravi Kumar
Follow us

|

Updated on: Apr 14, 2021 | 7:55 AM

Tdp Leader: టీడీపీ, నేత, మాజీ ప్రభుత్వ విప్ కూన రవికుమార్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆయనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. రవి కుమార్‌ కోసం గాలిస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఈ నెల 8 వ తేదీన మండల పరిషత్ ఎన్నికల పోలింగ్ ముగిసిన అనంతరం ఆయన స్వగ్రామం పెనుబర్తిలో టీడిపి ఏజెంట్ల పై వైసీపీ వర్గీయుల దాడికి పాల్పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న కూన రవికుమార్.. ఆరా తీసేందుకై పెనుబర్తికి వెళ్లారు. ఆయనకంటే ముందే పోలీసులు గ్రామానికి చేరుకున్నారు. ఘటనకు కారకులైన వారిని ప్రశ్నించకుండా, గాయపడిన టీడీపీ నేతలను అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. దాంతో ఆగ్రహించిన కూన రవికుమార్.. పోలీసుల చర్యను తీవ్రంగా ఖండించారు. ఈ అంశంపై శ్రీకాకుళం డీఎస్పీ మహేంద్రను దుర్భాషలాడారు కూన రవికుమార్. ఆయన అనుచరులు సైతం పోలీసుల పట్ల అమర్యాదగా ప్రవర్తించారు. దీన్ని పోలీసు అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. విధినిర్వహణలో వున్న డిఎస్పీ సహా పోలీసుల పట్ల దుర్భాషలాడిన ఘటనలో 29 మంది టీడీపీ నేతలపై కేసు నమోదు చేశారు. ఇప్పటికే 20 మంది టీడీపీ చెందిన నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కాగా, ఈ కేసులో కూన రవికుమార్‌ను ఏ-1 ముద్దాయిగా చేర్చారు పోలీసులు. ఈ నేపథ్యంలోనే అయన్ను అదుపులోకి తీసుకుందామని పోలీసులు ఆయన ఇంటికి వెళ్లగా.. అజ్ఞాతంలోకి వెళ్లినట్లు నిర్ధారించుకున్నారు. రవి కుమార్‌తో పాటు.. మరో 8 మంది కూడా అజ్ఞాతంలోకి వెళ్లినట్లు గుర్తించిన పోలీసులు.. వారి కోసం గాలిస్తున్నారు. బృందాలుగా ఏర్పడిన పోలీసులు కూన రవి కుమార్‌ కోసం ఆయన ఇంటితో పాటు.. బంధువులు, సన్నిహితుల ఇళ్లలో తనిఖీలు చేస్తున్నారు. ఇలా ఇప్పటికే నాలుగు కేంద్రాల్లో కూన రవికుమార్ ఏ-1 ముద్దాయిగా ఉన్నారు. అయితే, పోలీసుల అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి కూన రవికుమార్ అజ్ఞాతంలోకి వెళ్లడం ఇది మూడవ సారి. ఇదిలాఉంటే.. పెనుబర్తి ఘటనపై పోలీసులు ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. ఈ ఘటనలో విధి నిర్వహణలో అలసత్వం వహించారంటూ టూ టౌన్ సీఐ రమణను సస్పెండ్ చేశారు.

Also read:

Summer Makeup Tips: సమ్మర్ సీజన్ లో పెళ్లిళ్ల సందడి మొదలు. అయితే మేకప్ కరిగిపోకుండా ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే సరి..

YS Viveka Murder: వైఎస్ వివేకా హత్య కేసు విచారణలో స్పీడ్ పెంచిన సీబీఐ.. నేడు మరికొంతమందిని ప్రశ్నించనున్న అధికారులు..