Summer Makeup Tips: సమ్మర్ సీజన్ లో పెళ్లిళ్ల సందడి మొదలు. అయితే మేకప్ కరిగిపోకుండా ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే సరి..
Summer Makeup Tips: అందంగా, ఆకర్షణీయంగా కనిపించడం అందరూ ఇష్టపడతారు. కొంతమంది అందంగా కనిపించడం కోసం మేకప్ ను ఆశ్రయిస్తారు. ప్రస్తుత జనరేషన్ లో..
Summer Makeup Tips: అందంగా, ఆకర్షణీయంగా కనిపించడం అందరూ ఇష్టపడతారు. కొంతమంది అందంగా కనిపించడం కోసం మేకప్ ను ఆశ్రయిస్తారు. ప్రస్తుత జనరేషన్ లో చిన్న పిల్లలకు కూడా అందంపై మక్కువ ఎక్కువైంది. అమ్మతో పాటు.. మేకప్ సామాన్లు తాము కూడా వాడతాం అంటున్నారు. చాలామంది అమ్మాయిలు అయితే.. ఇంటి నుంచి కాలు బయట పెట్టాలంటే.. మేకప్ ఉండాల్సిందే అన్నచందంగా తయ్యారయ్యారు. అంతగా మేకప్ కు అలవాటు పడిపోయారు. ఇక వేసవి కాలంలో ఎక్కువగా పెళ్ళిళ్ళూఫంక్షన్ల కూడా ఉంటాయి. దీంతో మేకప్ ను ఎక్కువగా వాడుతుంటారు. ఎండలు మండిస్తున్నాయి. దీంతో ఈ సీజన్ లో మేకప్ వేసుకుంటే.. ఎండలకు చెమట పట్టి… మేకప్ కరిగిపోయి.. డిఫరెంట్ గా కనిపిస్తారు.. అయితే ఆలాంటి వారు కొన్ని టిప్స్ ను పాటిస్తే.. మండే ఎండలో కూడా మేకప్ చెదిరిపోకుండా ఎక్కువ సమయం ఉంటుంది.. సింపుల్ చిట్కాలు ఏమిటో తెలుసుకుందాం..!
*ఎండలో వెళ్లినా వేసిన మేకప్ కరిగిపోకుండా ఉండాలంటే.. ముందుగా ముఖాన్ని శుభ్ర పరచుకోవాలి. తర్వాత ఒక ఐస్ క్యూబ్ ను తీసుకుని కాటన్ క్లాత్‌లో వేసి ముఖానికి అద్దుకోవాలి. ఇలా ఐదు నిమిషాల పాటు చేయాలి. తర్వాత తడిని తుడుచుకుని మేకప్ వేసుకుంటే ఎండ వేడికి త్వరగా కరిగిపోకుండా ఉంటుంది.
* వేసవి కాలంలో తప్పని సరిగా వేడి నుంచి చర్మానికి రక్షణ ఇచ్చే సన్‌స్క్రీన్ లోషన్ రాసుకోవాలి. తర్వాత మేకప్ వేసుకోవాలి.
*కొంతమంది మేకప్ కి ముందు ఫౌండేషన్ వాడతారు. అయితే సమ్మర్‌లో నార్మల్ ఫౌండేషన్‌నే వాడితే.. కొంత సమయానికే కరిగిపోతుంది. అందువల్ల, ఆయిల్‌ఫ్రీ, మినరల్ బేస్డ్ ఫౌండేషన్‌నే వాడాలి.
* కొంతమంది కాంపాక్ట్ పౌడర్ వేసుకున్న తర్వాత చెమట పడితే.. మళ్ళీ వెంటనే కాంపాక్ట్ అప్లై చేస్తారు. అయితే ఈ సమ్మర్ సీజన్ లో ఆయిల్ ఫేస్ ఉన్నవారు.. ఆయిల్ ని అబ్జార్బ్ చేసుకునే బ్లాటింగ్ షీట్స్ వాడితే.ముఖం ఫ్రెష్ లుక్ లో కనిపిస్తుంది.
*ఇక ఫౌండేషన్‌కు ముందు తప్పకుండా ప్రైమర్ అప్లై చేయాలి. వేసవి లో లిక్విడ్ లో ఉండే బ్లష్, ఐ షాడో వంటివి పక్కన పెట్టి.. పౌడర్ ఫార్మ్ లో ఉన్నవి వాడితే మంచిది. దీంతో చెమట పట్టినా బ్లష్, ఐ షాడోలు త్వరగా కరిగిపోవు.
ముఖ్యంగా సమ్మర్ సీజన్ లో మస్కారా, కాంపాక్ట్ పౌడర్, కాటుక, ఐ లైనర్, లిప్ స్టిక్, ఇలాంటి ప్రోడెక్ట్స్ వాటర్ ప్రూఫ్ లో ఉండేవి వాడితే.ఎక్కువ సమయం మేకప్ చెదరకుండా ఉంటాయి. అయితే పెళ్లిళ్లు, ఫంక్షన్లు ఏమైనా సరే.. వేసవిలో ఎంత లైట్ మేకప్ వేసుకుంటే అంత చికాకునుంచి తప్పించుకోచ్చు.
Also Read: శానిటైజర్ ఎక్కువగా వాడుతున్నారా.. ఆరోగ్యానికి ఎంత హానికరమో తెలుసా..!