YS Viveka Murder: వైఎస్ వివేకా హత్య కేసు విచారణలో స్పీడ్ పెంచిన సీబీఐ.. నేడు మరికొంతమందిని ప్రశ్నించనున్న అధికారులు..

YS Viveka Murder: ముఖ్యమంత్రి జగన్ బాబాయ్, దివంగత నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారులు నాలుగో రోజు విచారించనున్నారు.

YS Viveka Murder: వైఎస్ వివేకా హత్య కేసు విచారణలో స్పీడ్ పెంచిన సీబీఐ.. నేడు మరికొంతమందిని ప్రశ్నించనున్న అధికారులు..
Ys Viveka
Follow us
Shiva Prajapati

|

Updated on: Apr 14, 2021 | 7:31 AM

YS Viveka Murder: ముఖ్యమంత్రి జగన్ బాబాయ్, దివంగత నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారులు నాలుగో రోజు విచారించనున్నారు. పులివెందులలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ కేంద్రంగా సీబీఐ అధికారులు వివేకా హత్య కేసుపై విచారణ జరుపుతున్నారు. ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన అధికారులు.. ఇప్పుడు మరో దఫా విచారణ చేస్తున్నారు. మంగళవారం నాడు లింగాల మండలం అంబకపల్లె గ్రామానికి చెందిన మహేశ్వరరెడ్డిని, ఆయన కుటుంబాన్ని సీబీఐ అధికారులు ప్రశ్నించారు. మహేశ్వరరెడ్డి కుటుంబం గతంలో వివేకానంద రెడ్డి పొలాన్ని కౌలుకు తీసుకుని సాగు చేసుకునేవారు. ఈ నేపథ్యంలోనే దర్యాప్తులో భాగంగా పలు అనుమానాలు నివృత్తి చేసుకునేందుకు మహేశ్వర రెడ్డి కుటుంబాన్ని సీబీఐ అధికారులు విచారించారు. పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు తెలుసుకున్నారు. మహేశ్వర రెడ్డి కుటుంబ సభ్యులు ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను సీబీఐ అధికారులు రికార్డ్ చేశారు. ఇక సోమవారం నాడు ఈ కేసులో అనుమాతులుగా ఉన్న ఎర్ర గంగిరెడ్డితో పాటు.. వివేకా పీఏ ఇనయతుల్లాను సీబీఐ అధికారులు విచారిరంచారు. వివేకా ఇంటి వద్ద ఉన్న పాల డైరీ, సెల్ పాయింట్ యజమానులను కూడా సీబీఐ అధికారులు విచారించారు. దీనికి కొనసాగింపుగా ఇవాళ కూడా విచారణ చేపట్టనున్నారు. మరికొంతమంది అనుమానితులను సీబీఐ అధికారులు ప్రశ్నించనున్నారు.

2019 మార్చి 14వ తేదీన వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు, సీఎం జగన్ బాబాయ్.. వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. బాత్‌రూమ్‌లో రక్తపు మడుగులో నిర్జీవంగా పడి ఉన్నారు. ఆ ఘటన అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించింది. నాటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దీనిపై విచారణకు సిట్ ఏర్పాటు చేసింది. అయితే, సిట్ ఆ దర్యాప్తులో ఏమీ తేల్చలేకపోయింది. ఆ తరువాత వచ్చిన జగన్ సర్కార్ కూడా సిట్ వేయగా.. అదే పరిస్థితి రిపీట్ అయ్యింది. ఈ కేసు ఎంతకీ తేల్చకపోవడంతో వివేకానంద రెడ్డి కూతురు డాక్టర్ సునీత హైకోర్టు ఆశ్రయించారు. వివేకా హత్య కేసుపై సీబీఐ విచారణ చేయించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం.. సీబీఐ విచారణకు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేరకు వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ ఇంకా కొనసాగుతోంది.

Also read:

Covid vaccine : కోవిడ్ వ్యాక్సిన్ వినియోగాన్ని నిలిపివేసిన అగ్రరాజ్యం, అరుదైన రక్తం గడ్డకట్టే సమస్య ఎదురుకావడమే కారణం.!

Indian Railway: మీరు రైల్లో ప్రయాణం చేస్తున్నారా…? అయితే ఈ వివరాలు తప్పకుండా గుర్తించుకోవాలి

డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?