Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhuma Akhila Priya: తీహార్‌ జైల్లో పెట్టినా గెలుస్తా.. భూమా అఖిలప్రియ సంచలన వ్యాఖ్యలు..

మాజీ మంత్రి భూమా అఖిల‌ప్రియ మరోసారి వాయిస్‌ పెంచారు. సాలిండ్‌ డైలాగ్స్‌తో హీట్‌ పుట్టించారు. అన్నింటికీ సిద్ధమయ్యే రాజకీయాల్లోకి వచ్చానన్న అఖిల‌ప్రియ.. తనను తీహార్ జైల్లో వేసినా.. జైలు నుంచి నామినేషన్ వేసి గెలుస్తానని సవాల్‌ విసిరారు.

Bhuma Akhila Priya: తీహార్‌ జైల్లో పెట్టినా గెలుస్తా.. భూమా అఖిలప్రియ సంచలన వ్యాఖ్యలు..
Akhila Priya
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 31, 2023 | 9:01 AM

మాజీ మంత్రి భూమా అఖిల‌ప్రియ చేసిన వ్యాఖ్యలు సంచ‌లనంగా మారాయి. తనను ప్రజల్లోకి వెళ్లకుండా, ప్రజల మధ్య తిరగకుండా అడ్డుకొనేందుకు కుట్ర పన్ని తనపై కేసులు పెట్టారని ఆరోపించారు. ఏవీ సుబ్బారెడ్డి చున్నీ లాగారంటూ ఫిర్యాదు చేస్తే తనను మాత్రమే అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలోకి వస్తే హోం మంత్రి పదవిని మహిళకే ఇవ్వాలని కోరారు. తనను తీహార్‌ జైల్లో పెట్టినా పోటీ చేసి గెలుస్తానని, అన్నింటికీ సిద్ధమయ్యే రాజకీయాల్లోకి వచ్చినట్లు భూమా స్పష్టం చేశారు. ఏవీ సుబ్బరెడ్డి పార్టీలో ఉంటే.. ఈ నాలుగు సంవత్సరాలు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు అఖిలప్రియ. పార్టీలో ఉన్న గుంట నక్కల గురించి నారా లోకేష్ చూసుకుంటారన్నారు. ఎన్ని కేసులు పెట్టినా.. ఆళ్ళగడ్డ ప్రజలకు అండగా ఉంటానని స్పష్టం చేశారు. నంద్యాలలో మీడియాతో మాట్లాడిన ఆమె పోలీసులు తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఇక కొంత కాలంగా అఖిలప్రియ, సుబ్బారెడ్డి వర్గాల మధ్య వర్గపోరు నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్తపల్లి వద్ద ఇరు వర్గాల మధ్య ఘర్షణ మొదలైంది. ఆ తర్వాత ముదిరింది. అఖిలప్రియ మద్దతుదారుడు సుబ్బారెడ్డిపై దాడి చేయడంతో ఆయన ముక్కు నుంచి రక్తం కారింది. ఇది ఉద్రిక్తతకు దారితీసింది. ఏవీ సుబ్బారెడ్డిపై దాడి కేసులోనే అఖిలప్రియను పోలీసులు అరెస్ట్ చేశారు. నారా లోకేశ్ సమక్షంలోనే టీడీపీ నేతలు ఒకరిపై మరొకరు దాడులు చేసుకోవడం పార్టీ శ్రేణుల్లో కలకలం రేపింది. అప్పట్లో దీనిపై పార్టీ అధినేత చంద్రబాబు సైతం సీరియస్ అయ్యారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం..