Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Elections 2024: మునుపటి పట్టుకోసం భారీ స్కెచ్‌.. మాజీ ఎమ్మెల్యేలపై గురిపెట్టిన సైకిల్‌ పార్టీ..

ఉత్తరాంధ్ర లో బలమైన పట్టుకలిగిన టీడీపీకి 2019 ఎన్నికల్లో గట్టి షాకే తగిలింది. శ్రీకాకుళంలో అచ్చెన్నాయుడు, ఇచ్చాపురం నుంచి బెండ్యాల అశోక్, విశాఖలో నాలుగు స్థానాలు తప్ప.. ఎక్కడా విజయం దక్కలేదు. విశాఖ రూరల్‌ స్థానంతో పాటు... విజయనగరాన్ని స్వీప్ చేసిన వైసీపీ... శ్రీకాకుళంలో..

Elections 2024: మునుపటి పట్టుకోసం భారీ స్కెచ్‌.. మాజీ ఎమ్మెల్యేలపై గురిపెట్టిన సైకిల్‌ పార్టీ..
Chandrababu
Follow us
Sanjay Kasula

| Edited By: Ravi Kiran

Updated on: Jun 14, 2022 | 7:42 PM

ముందస్తు ఎన్నికలు రావచ్చన్న భావనలో ఉన్న తెలుగు దేశం పార్టీ వేగంగా పావులు కదుపుతోంది. అర్బన్ లో ముఖ్యంగా విశాఖ నగరంలో పూర్తి పట్టున్న టీడీపీ ప్రస్తుతం విశాఖ గ్రామీణం తో పాటు ఉత్తరాంధ్ర ను ప్రభావితం చేయగల మాజీ ఎమ్మెల్యేలపై తాజాగా దృష్టి సారించింది. దాదాపు గా అసంతృప్తి గా ఉన్న నేపథ్యంలో వారిని తిరిగి తెచ్చుకోవడం ద్వారా పార్టీని మరింత బలోపేతం చేయడమే కాకుండా నేతలంతా టీడీపీ వైపు చూస్తున్నారన్న ఒక మెసేజ్ నీ పంపాలన్న ఆలోచనలో ఉంది టీడీపీ. ఉత్తరాంధ్ర లో బలమైన పట్టుకలిగిన టీడీపీకి 2019 ఎన్నికల్లో గట్టి షాకే తగిలింది. శ్రీకాకుళంలో అచ్చెన్నాయుడు, ఇచ్చాపురం నుంచి బెండ్యాల అశోక్, విశాఖలో నాలుగు స్థానాలు తప్ప.. ఎక్కడా విజయం దక్కలేదు. విశాఖ రూరల్‌ స్థానంతో పాటు… విజయనగరాన్ని స్వీప్ చేసిన వైసీపీ… శ్రీకాకుళం లో రెండు తప్ప అన్ని స్థానాలు తన ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత జరిగిన పంచాయతీ, మునిసిపల్ ఎన్నికల్లో 90 శాతం స్థానాలు వైసీపీ దక్కించుకున్నప్పటికీ… చాలా చోట్ల టీడీపీ బలమైన పోటీనే ఇచ్చింది. గ్రేటర్ విశాఖ మున్సిపల్‌ ఎన్నికల్లో… 98 డివిజన్లకు గాను, 33 స్థానాలు గెలిచి బలం చూపించుకుంది. అయితే, మునుపటి పట్టు సాధించడమెలా? అన్నదానిపై టీడీపీ అధిష్టానం దృష్టి పెట్టింది. ఇటీవల పార్టీ చేపట్టిన పోరాటాలకు మంచి స్పందన రావడం, చంద్రబాబు రెండు రోజుల ఉత్తరాంధ్ర పర్యటన కూడా బిగ్ హిట్ కావడంతో… కొత్త ఆశలు పుట్టుకొచ్చాయి.

ఉత్తరాంధ్రలో మళ్లీ ఉడుం పట్టు సాధించేందుకు… పెద్ద స్కెచ్చే వేసింది టీడీపీ. రకరకాల కారణాలతో పార్టీ మారిన మాజీ ఎమ్మెల్యేలపై మొదటగా ఫోకస్ పెట్టింది. మాజీలైనా జనంలో తిరుగుతున్నవారినీ… అంగ, అర్థ బలం కలిగి తిరిగి పోటీ చేయాలన్న లక్ష్యంతో ఉన్నవారినీ…. అలాంటి బలాబలగాలేవీ లేకపోయినా ప్రజల్లో మంచి పేరు, సాను భూతి కలిగిన నేతలను లక్ష్యంగా చేసుకుంది. అలాంటివారితో చర్చలు జరిపి పార్టీలోకి తీసుకొచ్చేలా చూడాలని.. స్థానిక నాయకత్వానికి సూచించింది టీడీపీ హైకమాండ్‌. ఇప్పుడు చేరినా భవిష్యత్తుల్లో పొత్తుల కారణంగా సీటు దక్కకపోయినా, రాజకీయంగా ఢోకా లేకుండా చసే అంశాలపైనా వారితో టీడీపీ నేతలు చర్చిస్తున్నట్టు సమాచారం.

ఎన్నికల వ్యయాన్ని భరించగల మాజీ ఎమ్మెల్యేలకు బంపర్‌ ఆఫర్‌ ఇస్తోంది టీడీపీ. వారి సామాజిక వర్గ బలాన్నిపట్టి వారు కోరుకునే సీట్లు ఇవ్వడానికి కూడా సిద్దంగా ఉన్నట్టు సంకేతాలిస్తోంది. దీంతో మాజీ లు కూడా ఈ ఆఫరేదో బాగుందన్నట్టు స్పందిస్తున్నట్టు సమాచారం. ఒకవైపు ప్రభుత్వ వ్యతిరేకత, మరోవైపు టీడీపీ ఆఫర్ ఈ రెండూ బేరీజు వేసుకుంటూ.. కొన్నాళ్లాగి తమ నిర్ణయాన్ని చెబుతామంటున్నారట. టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన పంచకర్ల రమేష్, అర్బన్‌ పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన రెహ్మాన్, నగర్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా పనిచేసిన తయినాల విజయకుమార్ .. వంటి నేతలు ఈ లిస్టులో ఉన్నట్టు తెలుస్తోంది. ఆ మాజీలు ఇప్పటికిప్పుడు పాజిటివ్ రెస్పాన్స్‌ ఇవ్వకపోవడంతో… అక్కడ కాకపోతే ఇక్కడ అన్నట్టుగా ఆశ చూపుతోంది అధికార వైసీపీ. అయితే, ప్రస్తుత ప్రభుత్వంలో అలాంటి నేతలకు ఎలాంటి పదవులూ లేకపోవడంతోనే టీడీపీ వైపు చూస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇవి కూడా చదవండి

ఉత్తరాంధ్రలో పార్టీకి మళ్లీ వెలుగులు తెచ్చేందుకు.. టీడీపీ చేస్తున్న మాజీలను దువ్వడం అనే ప్రక్రియ ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నట్టు తెలుస్తోంది. తరచూ వారితో టచ్ లో ఉండి.. సరైన సమయంలో అధిష్టానాన్ని జోక్యం చేయించి టీడీపీ లో చేర్పించాలన్న లక్ష్యంతో స్థానిక నేతలు ముందుకెళ్తున్నారట. మరి, ఈ ప్లాన్‌ ఎంతవరకు సక్సెస్‌ అవుతుందో చూడాలి.