Andhra Pradesh: విశాఖలో రెచ్చిపోయిన యూట్యూబర్స్‌.. ఓ మహిళ ఇంట్లో చొరబడి.. నగ్నంగా వీడియోలు తీసి..

Andhra Pradesh: విశాఖలో ఇద్దరు యూట్యూబర్స్‌ గ్యాంగ్‌ రేప్‌కు పాల్పడ్డారు. నిందితుల్లో ఒకరు రౌడీషీటర్‌, మరొకరు కరుడుకట్టిన నేరస్థుడు. ఇద్దరినీ కటకటాల వెనక్కి నెట్టారు

Andhra Pradesh: విశాఖలో రెచ్చిపోయిన యూట్యూబర్స్‌.. ఓ మహిళ ఇంట్లో చొరబడి.. నగ్నంగా వీడియోలు తీసి..
Representational Image
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 15, 2022 | 5:50 AM

Andhra Pradesh: విశాఖలో ఇద్దరు యూట్యూబర్స్‌ గ్యాంగ్‌ రేప్‌కు పాల్పడ్డారు. నిందితుల్లో ఒకరు రౌడీషీటర్‌, మరొకరు కరుడుకట్టిన నేరస్థుడు. ఇద్దరినీ కటకటాల వెనక్కి నెట్టారు పోలీసులు. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న యూట్యూబ్‌ ఛానెల్స్‌తో అదేస్థాయిలో నేరాలు కూడా జరుగుతున్నాయ్‌. ప్రముఖ టీవీ ఛానెల్స్‌కు దగ్గరకు పేర్లు పెట్టుకుని యూట్యూబ్ ఛానెల్స్‌ తెరుస్తూ మోసాలు, అరాచకాలకు పాల్పడుతున్నారు కొందరు కేటుగాళ్లు. ఇలాంటి యూట్యూబ్‌ ఛానెల్స్‌ను తమకు అనుకూలంగా మార్చుకుని చెలరేగిపోతున్నారు రౌడీషీటర్లు, అసాంఘిక శక్తులు. చేతిలో మైక్‌ పట్టుకుని, మెడలో ట్యాగ్‌ వేసుకుని, బెదిరింపులకు పాల్పడుతూ జనాన్ని దోచుకుంటున్నారు.

విశాఖలో ఓ యూట్యూబ్‌ ఛానెల్‌ పేరుతో ఏకంగా గ్యాంగ్ రేపే చేశారు ఇద్దరు కేటుగాళ్లు. టీవీ10 పేరుతో వెలసిన యూట్యూబ్‌ ఛానెల్‌లో పనిచేస్తున్న వంకా కుమార్‌, శేఖర్‌ కలిసి ఓ మహిళపై అత్యాచారం చేశారు. ఇంట్లోకి అక్రమంగా చొరబడి, ఆమెను బెదిరించి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అనంతరం, ఇంట్లో ఉన్న డబ్బు, బంగారం మొత్తం ఎత్తుకెళ్లాడు. అత్యాచారం చేయడమే కాకుండా ఆమె నగ్న వీడియోలు తీసి బెదిరింపులకు పాల్పడుతుండటంతో పోలీసులను ఆశ్రయించింది బాధితురాలు. దాంతో, వంకా కుమార్‌, శేఖర్‌ను అరెస్ట్‌ చేశారు పోలీసులు. వంకా కుమార్‌పై గతంలో కూడా లైంగిక వేధింపుల కేసులు ఉన్నాయని, శేఖర్‌పై రౌడీషీట్‌ ఉందని తెలిపారు ఏసీపీ పెంటారావు. నిందితుల నుంచి యూట్యూబ్‌ ఛానెల్‌ లోగోలు, ఐడీ కార్డులు, కెమెరా, రెండు వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు.

బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌