Nara Lokesh Birthday: నేడు నారా లోకేష్ పుట్టిన రోజు.. వినూత్నరూపంలో సెలబ్రేట్ చేసిన ఓ అభిమాని
ఎకరం పొలంలో వరినారుతో నారాలోకేష్ ముఖ చిత్రం ఆకారంలో పంటను పండించారు. దాదాపు వంద రోజులపాటు ఈ పంటను జాగ్రత్తగా పెంచారు లోకేష్ వీరాభిమాని పులి చిన్నా. ఇక పండిన వరిని కోసి ఆ ధాన్యాన్ని లోకేష్ తల్లి భువనేశ్వరికి అందిస్తానని చెప్పారు పులి చిన్నా.

ఇప్పటి వరకూ ఎక్కువగా సినీ నటీనటులకు, క్రీడాకారులకు అభిమానూలు చూపించే అభిమానం మాత్రమే చూశాం.. అయితే తమ అభిమాన రాజకీయ నేతల పట్ల కార్యకర్తలు చూపించే అభిమానం కూడా ఆకాశన్ని తాకుతుంది. తాజాగా టీడీపీ యువనేత నారా లోకేష్ పుట్టినరోజు వేడుక వినూత్నరూపంలో చాటారు ఓ అభిమాని. బర్త్ డే ఎప్పటికీ గుర్తుండిపోయేలా సెలబ్రేట్ చేశారాయన.
గుంటూరుజిల్లా తెనాలి సమీపంలోని కూచిపూడి గ్రామానికి చెందిన రైతు, టిడిపి జాతీయ కార్యదర్శి లోకేష్ పుట్టినరోజును వినూత్న రూపంలో చాటారు. ఎకరం పొలంలో వరినారుతో నారాలోకేష్ ముఖ చిత్రం ఆకారంలో పంటను పండించారు. దాదాపు వంద రోజులపాటు ఈ పంటను జాగ్రత్తగా పెంచారు లోకేష్ వీరాభిమాని పులి చిన్నా. ఇక పండిన వరిని కోసి ఆ ధాన్యాన్ని లోకేష్ తల్లి భువనేశ్వరికి అందిస్తానని చెప్పారు పులి చిన్నా.
టీడీపీ కార్యకర్త, లోకేష్ అభిమాని అయినా రైతు పులి చిన్నా…ఆ వరి పంటను డ్రోన్ కెమెరాతో చిత్రీకరించారు. పంట లోకేష్ ముఖం ఆకారంలో ఉండటం, ఆ ప్రాంత వాసులతోపాటు టీడీపీ పార్టీ శ్రేణులను విశేషంగా ఆకర్షించింది. నారా లోకేష్, మాజీ సీఎం నారా చంద్రబాబుపైన తనకున్న అభిమానాన్ని చాటుకున్నానని చెప్పారు.




అమరావతి రాజధాని అంటూ చేసిన ఉద్యమాల్లో అనేకసార్లు లాఠీ దెబ్బలు తిన్నానని, ఆ సమయంలో తనకు నారా లోకేష్, చంద్రబాబు ఇచ్చిన ధైర్యమే వారిపట్ల తనకు అభిమానం పెరిగిందన్నారు. అందుకే ఉడతా భక్తిగా రుణం తీర్చుకుంటున్నానని చెప్పారు పులి చిన్న. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య కుమారుడు వర్ల కుమార్‌రాజా పాల్గొన్నారు. నారా కుటుంబంపై ఉన్న అభిమానాన్ని చాటుకున్న చిన్నను ప్రశంసించారు వర్ల కుమార్‌రాజా.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..