AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandra Babu: రాజధానిపై మళ్లీ మూడుముక్కలాట.. పాలించే అర్హత లేదు.. రాజీనామా చేసి రండి..

TDP: ఏపీలో మళ్లీ మూడు ముక్కలాటకు తెరతీశారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర భవిష్యత్‌పై విషం చిమ్ముతున్నారని విమర్శలు గుప్పించారు. భావితరాల భవిష్యత్‌పై ఇంత కక్ష పూరితంగా వ్యవహరించడం

Chandra Babu: రాజధానిపై మళ్లీ మూడుముక్కలాట.. పాలించే అర్హత లేదు.. రాజీనామా చేసి రండి..
Chandrababu
Sanjay Kasula
|

Updated on: Mar 24, 2022 | 8:59 PM

Share

ఏపీలో మళ్లీ మూడు ముక్కలాటకు తెరతీశారని టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు(Chandrababu) ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర భవిష్యత్‌పై విషం చిమ్ముతున్నారని విమర్శలు గుప్పించారు. భావితరాల భవిష్యత్‌పై ఇంత కక్ష పూరితంగా వ్యవహరించడం దుర్మార్గం అని అన్నారు. రాజధానిపై ఏకపక్షంగా నిర్ణయం తీసుకునే అధికారం లేదన్నారు. ప్రజలను చంపేస్తామని చట్టం చేయలేరని అన్నారు. అమరాతి గురించి మాట్లాడే హక్కు ఈ ప్రభుత్వానికి లేదన్నారు. ఆ రోజు అమరావతి రాజధానికి అంగీకారం తెలిపారని గుర్తుచేశారు. శాసనసభలో చట్టాలు చేయాలి కానీ జనాల ప్రాణాలు తీసే చట్టం చేస్తామంటే కోర్టులు ఊరుకోవని మండిపడ్డారు. అధికార వికేంద్రీకరణకు, అభివృద్ధి వికేంద్రీకరణకు తేడా తెలీని వాళ్లు శాసనసభ్యులుగా ఉన్నారన్న మండిపడ్డారు. ప్రజలకు కావల్సింది అభివృద్ధి వికేంద్రీకరణ అని అన్నారు. శాసనసభలో వైసీపీ ప్రభుత్వం మళ్లీ మూడు ముక్కలాటకు శ్రీకారం చుట్టటం దుర్మార్గమని ధ్వజమెత్తారు.

భావితరాల భవిష్యత్తుపై ఇంత కక్షగా వ్యవహరించటం దురదృష్టకరమని మండిపడ్డారు. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అభ్యంతరాలు ఉంటే న్యాయస్థానాలకు వెళ్లకుండా మొండిగా వితండవాదం చేయటమేంటని ప్రశ్నించారు. ప్రజలు అధికారం కట్టబెట్టింది విధ్వంసం చేయటానికి కాదన్న చంద్రబాబు.., అమరావతి గురించి మాట్లాడే నైతిక హక్కు ముఖ్యమంత్రి జగన్​కు లేదన్నారు. చేతనైతే రాజధాని అమరావతి అంశంపై ప్రభుత్వాన్ని రద్దు చేసి ప్రజాభిప్రాయం కోరాలని ప్రభుత్వానికి సవాల్ విసిరారు.

ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే కోర్టులు జోక్యం చేసుకోవా..? అని చంద్రబాబు ప్రశ్నించారు. రాజధాని నిర్ణయించిన తరువాత తప్పనిసరిగా కేంద్రం అనుమతి తీసుకోవాలని అన్నారు. న్యాయ సూత్రాలకు అనుగుణంగా చట్టాలను చేయాలన్నారు. ల్యాండ్ పూలింగ్‌లో రియల్ ఎస్టేట్ ఏంటి..? అని అడిగారు. ఇష్టానుసారం అవాకులు, చవాకులు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లేని సమస్యలను సృష్టిస్తున్నారని.. అందరూ కాళ్ల బేరానికి రావాలనుంటున్నారని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం విశ్వసనీయత పోగొట్టుకునేలా ప్రవర్తిస్తోందని.. భూములు ఇచ్చిన రైతులపైనే దాడులు చేశారని మండిపడ్డారు.

ఇవి కూడా చదవండి: TS POLYCET 2022: తెలంగాణ పాలిసెట్ నోటిఫికేషన్ విడుదల.. చివరి తేదీ ఎప్పుడంటే..

చక్కని శరీర సౌస్ఠవం.. చూపు తిప్పుకోలేని అందం.. నడకలో రాజసం.. అయినా కష్టమొచ్చింది..