ట్రక్ డ్రైవర్ల భద్రత, సాధికారతే లక్ష్యం.. టాటా మోటార్స్, TV9 నెట్‌వర్క్ ఆధ్వర్యంలో రోడ్ సేఫ్టీ సమ్మిట్
ట్రక్ డ్రైవర్ల భద్రత, గౌరవం, సాధికారత కోసం టాటా మోటార్స్ & TV9 నెట్‌వర్క్ సంయుక్తంగా ఓ కీలక కార్యక్రమానికి నాంది పలికాయి.. భారతదేశంలో రోడ్డు భద్రతా ప్రమాణాలను పెంచేందుకు, టాటా మోటార్స్, TV9 నెట్‌వర్క్ సంయుక్తంగా “Trucking Into the Future – Safer Always” పేరుతో ఒక ప్రచారాన్ని ప్రారంభించారు.

ట్రక్ డ్రైవర్ల భద్రత, గౌరవం, సాధికారత కోసం టాటా మోటార్స్ & TV9 నెట్‌వర్క్ సంయుక్తంగా కీలక ప్రచారానికి నాంది పలికాయి.. భారతదేశంలో రోడ్డు భద్రతా ప్రమాణాలను పెంచేందుకు, టాటా మోటార్స్, TV9 నెట్‌వర్క్ సంయుక్తంగా “Trucking Into the Future – Safer Always” ప్రచారాన్ని ప్రారంభించాయి. దేశంలోని రవాణా వ్యవస్థలో తీవ్రమైన సమస్యగా ఉన్న ట్రక్ భద్రతను, మానవ, సాంకేతిక అంశాలపై సమానంగా దృష్టి పెట్టడం.. అలాగే పరిష్కరించడం ఈ రోడ్ సేఫ్టీ ప్రచారం లక్ష్యం. ఈ కార్యక్రమంలో భాగంగా, దేశవ్యాప్తంగా రోడ్ సేఫ్టీ సమ్మిట్‌లు నిర్వహిస్తున్నారు. ఈ ప్రచారంలో భాగంగా.. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో సైతం రోడ్ సేఫ్టీ సమ్మిట్ ను నిర్వహించారు. టాటా మోటార్స్, TV9 నెట్‌వర్క్ సంయుక్తంగా విజయవాడలోని నోవాటెల్ హెటల్ లో రోడ్ సేఫ్టి సమ్మిట్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ అసిస్టెంట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ రామశ్రీ ముఖ్య అతిథిగా పాల్గొని పప్రసంగించారు. వ్యవసాయం, హార్డ్‌వేర్, సిమెంట్, టెక్స్‌టైల్ వంటి పలు రంగాల ప్రముఖులు సైతం ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమయ్యారు. నిపుణులు రవాణా విధానాలను, రోడ్ సేఫ్టీ ముఖ్యతను, ఎడ్వాన్స్డ్ సాఫ్ట్‌వేర్ & ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వివరించారు.
విజయవాడకు చెందిన ఫ్లీట్- ట్రక్ యజమానులను ఒక వేదికపై సమీకరించి, టాటా మోటార్స్’– కొత్త తరహా ట్రక్కులు, అధునాతన కార్గో – ప్రయాణికుల భద్రతా అంశాలతో అవగాహన కల్పించారు. భద్రతా, ట్రక్కులతో చేసే ఫ్లీట్ ఆపరేషన్స్ న్యాయమైన నమ్మకాన్ని కలిగించే విధంగా, అలాగే లాభాల పెరుగుదలకు దోహదంచేసే విధంగా ఈ కార్యక్రమం జరిగింది. కీలక ప్రసంగాలు, ప్యానెల్ చర్చలు, టాటా మోటార్స్ ప్రత్యేక ప్రెజెంటేషన్లతో, వ్యాపార యజమానులను సమయోచితంగా ఫ్లీట్ అప్గ్రేడ్‌లు, డ్రైవర్లను శిక్షణ – సాధికారత దృష్టి పెట్టాలని ప్రేరేపించింది.. శిక్షణ పొందిన డ్రైవర్లు భద్రతా మార్గాలను అనుసరించే మూల శిలగా అభివర్ణించారు. ఈ కార్యక్రమం ట్రక్కింగ్, లాజిస్టిక్ రంగాలలో ప్రముఖ ప్రతినిధులను ఒకే వేదికపైకి తీసుకువచ్చింది. నిపుణుల చర్చ ట్రక్ డ్రైవర్‌లను – ట్రాన్స్‌పోర్టర్లను సాధికారతలో పెంపొందించడం మీద కేంద్రీకరించింది.. భారత రవాణా ఆర్థిక వ్యవస్థకు శక్తివంతమైన స్థంభాలు అన్న ఒక ముఖ్యమైన అంశాన్ని స్పష్టం చేసింది.. ట్రక్ భద్రత ఒక నియంత్రణ అంశం మాత్రమే కాకుండా, ఇది ఒక సామాజిక, ఆర్థిక, మానవతావాద సమస్య కూడా అని కూడా తెలియజేసింది.
ఒక చిన్న రోడ్డు ప్రమాదం డ్రైవర్ ఉపాధిని దెబ్బతీయడమే కాకుండా.. మొత్తం లాజిస్టిక్ వ్యవస్థ కుదేలయ్యేలా చేస్తుందని వక్తలు, ప్రతినిధులు చెప్పారు. ఫ్లీట్ యజమానులకు, ఇది కార్యాచరణకు తీవ్ర అవరోధాలు సృష్టిస్తుంది.. వ్యాపార వృద్ధిని, న్యాయ, ఆర్థిక సమస్యలను కలిగిస్తుంది. దీని వల్ల లాభాలు, నమ్మకం, వాటాదారుల విశ్వాసం తగ్గుతుంది. ఈ సమయోచితమైన, చాలా అవసరమైన ప్రచారాన్ని టాటా మోటార్స్, TV9 నెట్‌వర్క్ కలిసి నిర్వహించడం ద్వారా, రోడ్ సేఫ్టీ ఒక భాగస్వామ్య బాధ్యత అని గుర్తు చేస్తుంది. దీనికోసం ప్రభుత్వం, ఫ్లీట్ నిర్వాహకులు, తయారీదారులు, డ్రైవర్లు అందరూ ముఖ్య పాత్రలు వహిస్తున్నారు. ఆలోచనాత్మకంగా టాటా మోటార్స్ అధునాతన సాంకేతికతను కలిగిన, అత్యాధునిక భద్రతా అంశాలతో ట్రక్కుల పరిధిని తెలియజెప్పింది. శిక్షణతోపాటు ఆరోగ్యకరమైన డ్రైవర్ మాత్రమే రోడ్ సేఫ్టీ లో అతి ముఖ్యమైన భాగం అని నిపుణులు తెలిపారు.
“Trucking Into the Future – Safer Always” సంయుక్త ప్రచారం, టాటా మోటార్స్ & TV9 నెట్‌వర్క్ భారతదేశ వ్యాప్తంగా ట్రక్ డ్రైవర్ల భద్రత, గౌరవం, సాధికారతాలను బలపరిచే లక్ష్యంతో ప్రారంభించింది. ఈ ప్రచారం ఆధునిక సాంకేతికత మాత్రమే కాదు, డ్రైవర్ శిక్షణ, అవగాహన, ఆరోగ్య అంశాలపై కూడా ప్రాధాన్యతనిస్తుంది. ఈ సమ్మిట్ ఫ్లీట్ యజమానులు, ట్రక్ డ్రైవర్లు పోషించే కీలక పాత్రను, వారి ఎదుర్కొంటున్న సవాళ్లను, భవిష్యత్తులో భద్రత, అవసరాలను స్పష్టం చేసింది. రోడ్డు ప్రమాదాలు సాధారణ ఘటనలు మాత్రమే కాకుండా, డ్రైవర్ వారి, వారి కుటుంబాల జీవితాలను మార్చేస్తాయి. కాబట్టి, టాటా మోటార్స్– TV9 నెట్‌వర్క్ సంయుక్త ప్రచారం.. ఎందరో డ్రైవర్లలో చైతన్యాన్ని కలిగిస్తుంది.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సంస్ధలు, రవాణా సంస్థలు, వాహన తయారీదారులు, డ్రైవర్లు పాల్గొనడమే కాకుండా.. ఎన్నో విషయాలను వివరించారు. టాటా మోటార్స్ తన తాజా సేఫ్టీ ఫస్ట్ ట్రక్ లైన్-అప్ ప్రకటనను వృద్ధి చేస్తూ, సాంకేతిక పరిజ్ఞాన వినియోగం వల్ల మనుషుల ప్రాణాలు రక్షించవచ్చని అవగాహన కల్పించారు. మంచి రోడ్లు, వాహనాలు మాత్రమే సరిపోవు, డ్రైవర్ శిక్షణ – నిర్వహణ కూడా సమానంగా ముఖ్యమని గుర్తు చేశారు.
రోడ్ సేఫ్టీ ఒక్కసారి సాధించిన విషయం కాదు.. ఇది ఒక నిరంతర ప్రక్రియ.. ట్రక్కులు, దారులు ఆధునీకరణతోపాటు.. డ్రైవర్ల శిక్షణ, ఆరోగ్యం, అవగాహన లేకుంటే పూర్తి మార్పు సాధ్యం కాదు. టాటా మోటార్స్ – TV9 నెట్‌వర్క్ ఈ ప్రచారాన్ని దేశవ్యాప్తంగా కొనసాగిస్తున్నది మార్పు కోసమే.. రోడ్డు భద్రత.. భవిష్యత్తు.. అనేది అవగాహనతోపాటు.. శిక్షణ, ఉత్తమమైన ట్రక్ డ్రైవర్ల ఆశయసాధనతో ఆధారపడి ఉంటుంది.