Vangalapudi Anitha: నాగలి పట్టి పొలం దున్నిన హోంమంత్రి వంగలపూడి అనిత అనిత!
నిత్యం ప్రభుత్వ కార్యక్రమాలతో బిజీబిజీగా ఉండే ప్రజాప్రతినిధులు పండగల సందర్భాల్లో ప్రజలతో సరధాగా కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. అయితే ఇవాళ అనకాపల్లి జిల్లాలో పర్యటించిన ఏపీ హొంమంత్రి అనిత ఏరువాక పౌర్ణమి సందర్భంగా భూమి పూజ చేసిన ఆమె.. కాడెడ్లతో నాగలి పట్టుకొని పొలం దున్నారు. ఈ సందర్భంగా రైతులందరికీ హోంమంత్రి అనిత ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.

అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో హోం మంత్రి వంగలపూడి అనిత పర్యటించారు. అయితే ఇవాళ ఏరువాక పౌర్ణమి సందర్భంగా ఎస్.రాయవరం మండలం గెడ్డపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన ఏరువాక పౌర్ణమి కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా హోంమంత్రి అని భూమి పూజ చేసి.. కాడెడ్లతో నాగలి పట్టుకొని పొలం దున్నారు. ఈ సందర్భంగా రైతులందరికీ హోంమంత్రి అనిత ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత రైతులకు రాయితీపై విత్తనాలు పంపిణి చేశారు.
కష్టాన్ని నమ్ముకొని.. దేశానికి అన్నం పెడుతున్నకర్షకుల పండుగ ఏరువాక పౌర్ణమి.. ఈ ఏడాది సిరులు పండించాలని కోరుకుంటూ అన్నదాతల ఏరువాక పండుగలో భాగమయ్యాను. ఎస్ రాయవరం మండలం గెడ్డపాలెంలో భూమిపూజ చేసి రైతు నేస్తాలైన ఎద్దులకు పూజ చేయడం జరగింది. అనంతరం కాడెడ్లతో నాగలి పట్టుకొని పొలం దున్ని… pic.twitter.com/ZVqPlzc1rM
— Anitha Vangalapudi (@Anitha_TDP) June 11, 2025
ఈ సందర్భంగా హోం మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ.. రైతులకు ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. దేశానికి రైతులు వెన్నుముక వంటి వారని చెప్పుకొచ్చారు. తమ ప్రభుత్వం వ్యవసాయానికి, రైతులకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది చెప్పుకొచ్చారు. పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా వ్యవసాయానికి ఉపయోగపడే ఆధునీకరణ పరికరాలను కూడా తమ ప్రభుత్వం రైతులకు అందజేస్తుందని తెలిపారు. ఏపీ ప్రభుత్వం డ్రోన్లు ఉపయోగించి, రైతులు వ్యవసాయం చేసేలా ప్రోత్సహిస్తుందని చెప్పుకొచ్చారు. ఇందులో భాగంగానే రైతులకు 80 శాతం రాయితీపై డ్రోన్లు అందిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది పంటలు సమృద్ధిగా పండి.. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నట్టు ఆమె తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..