Andhra Weather: కాస్త లేటయింది కానీ వాన కబురు చెప్పారండోయ్..
తెలుగు రాష్ట్రాల్లో రాగల మూడు రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు అనేక ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర, దక్షిణాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో కొన్ని చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు ఉంటాయి. గంటకు 50-60 కి.మీ వేగంతో ఈదురు గాలులు, ఉరుములతో మెరుపులు గమనించవచ్చు. ప్రజలు అప్రమత్తంగా ఉండి, వాతావరణ శాఖ సూచనలు పాటించాలి.

పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ సమీపంలో ఉపరితల ఆవర్తనం సగటు సముద్రమట్టానికి 5.8 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఉత్తర తమిళనాడు నుండి దక్షిణ మహారాష్ట్ర తీరం వరకు 15° ఉత్తర అక్షాంశం వెంబడి గాలుల కొత (షీర్ జోన్) 3.1-4.5 కి.మీ ఎత్తులో గుర్తించబడింది. ఈశాన్య రాజస్థాన్ నుండి ఛత్తీస్‌గఢ్ వరకు సగటు సముద్రమట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది. ఈ క్రమంలో రాగల మూడు రోజుల వాతావరణ సూచనలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం:
బుధవారం: తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు ఉంటాయి. గంటకు 50-60 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది.
గురువారం: అనేక ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలకు అవకాశం ఉంది. కొన్ని చోట్ల భారీ వర్షాలు కురవవచ్చు. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులుకు కూడా అవకాశం ఉంది
శుక్రవారం: అనేక ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు. గంటకు 40-50 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్:
బుధవారం: తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురుస్తాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు ఉంటాయి. బలమైన ఈదురు గాలులు గంటకు 50-60 కి.మీ వేగంతో వీచే అవకాశం.
గురువారం: తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు అనేక ప్రాంతాల్లో కురిసే అవకాశం. కొన్ని చోట్ల భారీ వర్షాలు. ఉరుములతో మెరుపులు, బలమైన గాలులు ఉంటాయి.
శుక్రవారం: తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు. గంటకు 40-50 కి.మీ వేగంతో గాలులు ఉంటాయి.
రాయలసీమ:
బుధవారం: తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం. కొన్ని చోట్ల భారీ వర్షాలు. ఉరుములతో మెరుపులు, బలమైన గాలులు గంటకు 50-60 కి.మీ వేగంతో ఉంటాయి.
గురువారం & శుక్రవారం: తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు అనేక ప్రాంతాల్లో కురుస్తాయి. ఉరుములతో మెరుపులు, 40-50 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది.
భారీ వర్షాలు, ఉరుములతో కూడిన మెరుపులు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తీవ్ర ప్రభావం చూపవచ్చు. ఉత్తరాంధ్ర (ఉత్తర కోస్తా), దక్షిణాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ముఖ్యంగా ఈ ప్రభావం కనిపించవచ్చు. ప్రజలు అప్రమత్తంగా ఉండి, సంబంధిత అధికారులు జారీ చేసిన సూచనలను పాటించాలి.