AP Weather Report: రేపు, ఎల్లుండి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ సూచన
ఉత్తర అండమాన్ సముద్రం, పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 3.1 కిమీఎత్తు వరకు విస్తరించి కొనసాగుతోంది. అది ఒకే ప్రాంతంలో స్థిరంగా
Rain Alert: ఉత్తర అండమాన్ సముద్రం, పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 3.1 కిమీఎత్తు వరకు విస్తరించి కొనసాగుతోంది. అది ఒకే ప్రాంతంలో స్థిరంగా ఉండటం వలన అల్పపీడనము ఏర్పడటం ఆలస్యం అవుతోంది. తాజా విశ్లేషణ ప్రకారం, దీని ప్రభావం వలన తూర్పు మధ్య బంగాళాఖాతం, ఉత్తర అండమాన్ సముద్రం చుట్టూ అక్టోబర్ 13 న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులి దక్షిణ ఒడిషా ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాలకు అక్టోబర్ 15 నాటికి చేరి బలపడి అల్పపీడనంగా మారుతుందని అమరావతిలోని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
ఒక తూర్పు-పశ్చిమ ఉపరితల ద్రోణి ఉత్తరఅండమాన్ సముద్రం & దాని పరిసర ప్రాంతాలలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం నుండి కోస్తా ఆంధ్ర ప్రదేశ్, దక్షిణ తెలంగాణ, ఉత్తర కర్ణాటక మరియు దక్షిణ మహారాష్ట్రల మీదుగా తూర్పుమధ్య అరేబియా సముద్రప్రాంతములో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం వరకు సగటు సముద్రమట్టానికి 1.5km ఎత్తు వద్ద ఏర్పడింది. వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఇలా ఉన్నాయి:
ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాం :
ఈరోజు, రేపు, ఎల్లుండి ఉత్తర కోస్తాఆంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు జల్లులు 1 లేక 2 చోట్ల కురిసే అవకాశం ఉంటుంది
దక్షిణ కోస్తా ఆంధ్ర:
ఈరోజు రేపు, ఎల్లుండి దక్షిణ కోస్తాఆంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు జల్లులు 1 లేక 2 చోట్ల కురిసే అవకాశం ఉంటుంది
రాయలసీమ:
ఈరోజు రేపు, ఎల్లుండి రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంటుంది.
Read also: Srikakulam: తిత్లీ తుఫాన్ చిచ్చు.. నడిరోడ్డు మీద తన్నుకున్న టిడిపి-వైసిపి వర్గాలు