Srikakulam: తిత్లీ తుఫాన్ చిచ్చు.. నడిరోడ్డు మీద తన్నుకున్న టిడిపి-వైసిపి వర్గాలు
తిత్లీ తుఫాన్ టిడిపి-వైసిపి మధ్య చిచ్చుపెట్టింది. అదేంటి..! మూడేళ్ల క్రితం వచ్చిన తుఫాన్‌కి.. ఈ గొడవకు కారణమేంటి అనే కదా మీ డౌట్..! అప్పుడు నష్టపోయిన
TDP Vs YSRCP: తిత్లీ తుఫాన్ టిడిపి-వైసిపి మధ్య చిచ్చుపెట్టింది. అదేంటి..! మూడేళ్ల క్రితం వచ్చిన తుఫాన్‌కి.. ఈ గొడవకు కారణమేంటి అనే కదా మీ డౌట్..! అప్పుడు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని టిడిపి ఇచ్చిన నిరసన కార్యక్రమాన్ని వైసిపి నేతలు తాజాగా అడ్డుకున్నారు. చివరికి ఇరువర్గాలు నడిరోడ్డుపై తన్నుకున్నాయి. వివాదం లోతుల్లోకి వెళ్తే.. 2018 అక్టోబర్ పదో తేదీ తెల్లవారుజామున తిత్లీ తుఫాన్ శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం అక్కుపల్లి వద్ద తీరం దాటింది. ఆ సమయంలో తుఫాన్ బీభత్సానికి రైతాంగం కుదేలైంది. వేలాది ఎకరాల్లో పంటనష్టం జరిగింది.
తిత్లీ పంట నష్టపరిహారం అంచనాలు వేసిన టిడిపి సర్కార్.. సాంకేతిక సమస్యలతో చెల్లింపులు జరపలేదు. ఆ తర్వాత ప్రభుత్వం మారిపోయింది. ఐతే నష్టపరిహారం చెల్లింపుల విషయంలో ఎవరూ పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో అక్కుపల్లి రైతులకు నష్టపరిహారం చెల్లించాలంటూ నిరసనకు పిలుపునిచ్చింది టిడిపి. ఇచ్చాపురం MLA బెందాలం అశోక్, టిడిపి రాష్ట్ర కార్యదర్శి గౌతు శిరీష నేతృత్వంలో కార్యకర్తలు పెద్దసంఖ్యలో వజ్రపుకొత్తూరు మండలం అక్కుపల్లి వద్దకు చేరుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
టిడిపి నిరసన విషయాన్ని తెలుసుకొన్న స్థానిక వైసిపి నేతలు వారిని అడ్డుకునేందుకు ప్లాన్ చేశారు. అక్కుపల్లి దగ్గరకు వచ్చిన టిడిపి నేతలను వైసిపి శ్రేణులు అడ్డుకున్నాయి. ఇరువర్గాలను పరస్పరం దాడి చేసుకున్నాయి. నడిరోడ్డుపై ఒకరి నొకరు కొట్టుకున్నారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. అక్కడే ఉన్న పోలీసులు వెంటనే ఇరువర్గాలను చెదరగొట్టాయి. రైతులకు జరిగిన నష్టపరిహారాన్ని చెల్లించాలని శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న తమపై అధికారపార్టీకి చెందిన నేతలు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు టిడిపి నేతలు. తిత్లీ బాధితులను సీఎం జగన్ గాలికొదిలేశారని ఆరోపించారు టిడిపి రాష్ట్ర కార్యదర్శి గౌతు శిరీష.
Read also: Huzurabad By Election: హుజురాబాద్ పొలిటికల్ లీగ్‌లో మరో ఇంట్రెస్టింగ్ డెవలప్‌మెంట్