AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MAA Reactions: ‘మా’ ఫలితాల తర్వాత రియాక్షన్లు.. లేదంటే, తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామంటూ హెచ్చరికలు

'మా' అసోషియేషన్ ఎన్నికల ఫలితాల తర్వాత.. ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. సభ్యులు ఒక్కొక్కరు తమ అభిప్రాయాలను నిరసనలు తెలియజేస్తున్నారు.

MAA Reactions: 'మా' ఫలితాల తర్వాత రియాక్షన్లు.. లేదంటే, తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామంటూ హెచ్చరికలు
Maa Results Reactions
Venkata Narayana
| Edited By: Ravi Kiran|

Updated on: Oct 11, 2021 | 7:26 PM

Share

MAA Election Results Reactions: ‘మా’ అసోషియేషన్ ఎన్నికల ఫలితాల తర్వాత.. ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. సభ్యులు ఒక్కొక్కరు తమ అభిప్రాయాలను నిరసనలు తెలియజేస్తున్నారు. గత రెండు సంవత్సరాల్లో మా అసోసియేషన్‌లో జరిగిన ఆర్ధిక లావాదేవీలపై నిజనిర్ధారణ కమిటీ వేయాలని కోరబోతున్నారు మా మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా. కొత్త కమిటీ దీనిపై చర్యలు తీసుకోకుంటే తన తదుపరి కార్యాచరణ ప్రకటిస్తానని అంటున్నారాయన.

మంచు విష్ణు విజయం ప్రకటించిన కొన్ని నిముషాల్లోనే మెగా బ్రదర్ నాగబాబు రాజీనామా ప్రకటించారు. ఆ తర్వాత ఇవాళ ఉదయం ప్రకాష్ రాజ్ కూడా.. తాను అసోషియేషన్‌లో కొనసాగలేనంటూ తేల్చి చెప్పారు. తెలుగు ఇండస్ట్రీలోకి అతిధిగా వచ్చా.. అతిధిగానే వెళ్లిపోతున్నట్టు తెలిపారాయన.

ఇప్పుడు ఇదే బాటలో సీనియర్ నటుడు శివాజీ రాజా కూడా అదే బాటలోకి వెళ్తున్నట్టు తెలుస్తోంది. ఈ దారిలో నెక్ట్స్ ఎవరు ఉంటారనేది ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది. ఎన్నికలు జరిగిన 24 గంటల్లోనే సభ్యులు రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది.

ఇన్ని రోజులు అసోషియేషన్‌తో కలిసి నడిచిన సభ్యులు వరుసగా రాజీమానాలు చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. విష్ణు గెలపును, ప్రకాశ్ రాజ్ ఓటమిని జీర్ణించుకోలేక రాజీనామా చేస్తున్నారా.. లేక అసోషియేషన్‌లో జరుగుతున్న పరిణామాలతో విసిగిపోయి.. సభ్యత్వాన్ని వదులుకుంటున్నారా.. అనేది అర్ధం కావడం లేదు.

మరోవైపు మా అసోషియేషన్ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ఇంకా కొనసాగుతోంది. నిన్న కొంత మంది కీలక సభ్యుల గెలుపును మాత్రమే ఈసీ ప్రకటించింది. మిగిలిన ఫలితాలను మరి కొద్ది సేపటిలో విడుదల కాబోతున్నాయి.

Read also: Chandrababu: కమీషన్ల కోసమే విద్యుత్ కొరత..! హౌస్ సైట్స్ మీద వైసీపీ నేతలతోనే కోర్టులో కేసులు: చంద్రబాబు

2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా