AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandrababu: కమీషన్ల కోసమే విద్యుత్ కొరత..! హౌస్ సైట్స్ మీద వైసీపీ నేతలతోనే కోర్టులో కేసులు: చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరు సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై మొత్తం రూ.36 వేల కోట్ల భారం మోపారని టిడిపి అధినేత చంద్రబాబు చెప్పారు.

Chandrababu: కమీషన్ల కోసమే విద్యుత్ కొరత..! హౌస్ సైట్స్ మీద వైసీపీ నేతలతోనే కోర్టులో కేసులు: చంద్రబాబు
Chandrababu
Venkata Narayana
|

Updated on: Oct 11, 2021 | 4:56 PM

Share

TDP Chief Chandrababu naidu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరు సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై మొత్తం రూ.36 వేల కోట్ల భారం మోపారని టిడిపి అధినేత చంద్రబాబు చెప్పారు. దక్షిణాది రాష్ట్రాలన్నింటి కంటే ఏపీలోనే విద్యుత్ చార్జీలు అధికంగా పెంచారని ఆయన తెలిపారు. డిస్కంలకు ప్రభుత్వం, ప్రభుత్వరంగ సంస్థలు బకాయి ఉన్న రూ.22 వేల కోట్లను వెంటనే విడుదల చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ల సామర్థ్యం మేరకు ఉత్పత్తి చేయిస్తే బహిరంగ మార్కెట్ లో రూ.15 నుంచి రూ.20 పెట్టి కొనాల్సిన అవసరం రాదని చంద్రబాబు ఏపీ సర్కారుకు సలహా ఇచ్చారు. ఇవాళ అమరావతిలో తెలుగుదేశం పార్టీ ముఖ్యనేతలతో చంద్రబాబు సమావేశం సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

కమీషన్ల కోసం బహిరంగ మార్కెట్ లో విద్యుత్ కొనడానికి కృత్రిమంగా విద్యుత్ కొరత సృష్టించారని కూడా టీడీపీ అధినేత ఆరోపించారు. తెలంగాణకు లేని సమస్య ఏపీకి ఎందుకు వచ్చిందని ప్రశ్నించిన చంద్రబాబు.. హౌస్ సైట్స్ విషయంలో వైసీపీ నేతలతోనే కోర్టులో పిటిషన్ వేయించి టీడీపీపై బురద జల్లుతున్నారని స్పష్టం చేశారు. గృహ నిర్మాణ పునాది పైన కేంద్రం రూ. 3,700 కోట్లు విడుదల చేసిందని చంద్రబాబు చెప్పారు. దీనిలో రూ.2 వేల కోట్లను దారి మళ్లించారని, దారి మళ్లించిన నిధులు లబ్ధిదారులకు ఎగనామం పెట్టేందుకు వైసీపీనే కోర్టులో కేసులు వేయించి దాన్ని ప్రతిపక్షాలకు అంటకట్టి దుష్ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు తెలిపారు.

“జగన్ రెడ్డి కట్టే ఇళ్లు శోభనానికి కూడా పనికిరావని వైసీపీ శాసనసభ్యులే చెప్పారు. సెంటు పట్టాలో రూ.6,500 కోట్ల అవినీతి చేశారు. రెండు సెంట్లు నగరాల్లో, 3 సెంట్లు గ్రామాల్లో ఇవ్వాలి. ఆషి ట్రేడింగ్ కంపెనీతో వేలకోట్ల రూపాయల డ్రగ్స్ మాఫియాకు శ్రీకారం చుట్టారు. ఆశి అనే పేరు ఆలీషా కుమార్తె యొక్క నిక్ నేమ్ కాదా? ఆలీషా పెద్ద మనిషి అని చంద్రశేఖర్ రెడ్డి కితాబు ఎందుకు ఇచ్చారు? వారి అక్రమ వ్యాపారానికి ఇది నిదర్శనం కాదా?” అంటూ చంద్రబాబు.. జగన్ సర్కారుకు ప్రశ్నలు లేవనెత్తారు.

Read also: Sajjala: ఇళ్లల్లో కరెంటు వాడకం తగ్గించండి.. ఆంధ్రాలో విద్యుత్ కోతలపై సజ్జల క్లారిటీ