MAA Elections 2021: ‘మా’ యుద్ధం ముగిసినా చల్లారని వేడి.. వరుస రాజీనామాలతో కొనసాగుతున్న ప్రకంపనలు

MAA Elections 2021: మాలో ప్రకంపనలు కంటిన్యూ అవుతున్నాయ్. యుద్ధం ముగిసినా వేడి చల్లారడం లేదు. మాలో ఇప్పుడు రాజీనామాల పర్వం నడుస్తోంది.

MAA Elections 2021: ‘మా’ యుద్ధం ముగిసినా చల్లారని వేడి.. వరుస రాజీనామాలతో కొనసాగుతున్న ప్రకంపనలు
Maa Elections 2021
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Oct 11, 2021 | 7:27 PM

MAA Elections 2021: మాలో ప్రకంపనలు కంటిన్యూ అవుతున్నాయ్. యుద్ధం ముగిసినా వేడి చల్లారడం లేదు. మాలో ఇప్పుడు రాజీనామాల పర్వం నడుస్తోంది. ఒకరి తర్వాత మరొకరు రిజైన్లతో సెగలు రేపుతున్నారు. ఎన్నికలన్నాక గెలుపోటములు సహజం. కానీ, ప్రకాష్‌రాజ్ ఓటమిని అతని మద్దతుదారులు జీర్ణించుకోలేకపోతున్నారు. అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టుగా ఏకంగా మా సభ్యత్వానికే రాజీనామా చేస్తున్నారు.  ప్రకాష్‌రాజ్ పరాజయం తర్వాత నాగబాబు మా ప్రాథమిక సభ్యత్వానికి రిజైన్‌ చేసి మరో సంచలనానికి తెరలేపారు. ప్రాంతీయవాదం, సంకుచిత మనస్త్తత్వంతో కొట్టుమిట్టాడుతోన్న మాలో ఉండలేనంటూ ట్వీట్ చేశారు. మా సభ్యులు ప్రలోభాలకు గురైనట్లు అర్ధమిచ్చేలా కామెంట్స్ చేశారు.

మా ఎన్నికల్లో ఓటమిపాలైన ప్రకాష్‌రాజ్‌ది కూడా ఇదే మాట. విష్ణు గెలుపును స్వాగతిస్తున్నా అంటూనే… మా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రాంతీయవాదం, జాతీయవాదం మధ్య జరిగిన ఎన్నికల్లో ప్రాంతీయవాదమే గెలిచిందంటూ కామెంట్ చేశారు. ‘నేను తెలుగువాడిని కాదు. నా తల్లిదండ్రులు తెలుగువాళ్లు కాదు. తెలుగువాడిగా పుట్టకపోవడం నా దురదృష్టం. అతిథిగానే వచ్చాను… అతిథిగానే ఉంటాను’ అంటూ ప్రకాష్‌రాజ్ వేదాంతం మాట్లాడారు. మాలో అంతా ఒక్కటేనన్నది పచ్చి అబద్ధమన్నారు ప్రకాష్‌రాజ్. తెలుగువాడే అధ్యక్షుడిగా ఉండాలనుకున్నారు. నేను తెలుగువాడిని కాకపోవడం నా తప్పా? అంటూ ఆవేదన వ్యకంచేశారు.

మా ఎన్నికల అనంతరం సభ్యత్వానికి రాజీనామా చేసిన మూడో వ్యక్తి.. మా మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా. తన సభ్యత్వానికి ఆచప రాజీనామా చేశారు. నరేష్‌ కారణంగానే మా ఎన్నికల్లో ఇంత రచ్చ జరిగిందని ఇది వరకే ఆయన ఆరోపించారు. గత రెండు సంవత్సరాల్లో మా అసోసియేషన్ లో జరిగిన ఆర్ధిక లావాదేవీలపై నిజనిర్ధారణ కమిటీ వేయాలని మా మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా కోరారు. కొత్త కమిటీ దీనిపై చర్యలు తీసుకోకుంటే తన తదుపరి కార్యాచరణ ప్రకటిస్తానని స్పష్టంచేశారు.

అటు మా ఫలితాల తర్వాత చిరంజీవి మాట్లాడిన మాటల్లో ఆ ఆవేదన స్పష్టంగా కనిపించింది. పదవులు తాత్కాలికం, ఆధిపత్యం కోసం ఇతరులను కించపర్చొద్దు, అల్లర్లతో మా పరువు తీయొద్దంటూ చిరు చేసిన కామెంట్స్ సంచలనం రేపుతున్నాయ్.

ఏ ఎన్నికల్లోనైనా ఒక్కరే విజేత ఉంటారు. ఎన్నికలన్నాక ఎన్నో అంశాలు తెరపైకి వస్తాయి. అది ఏదైనా కావొచ్చు. గెలిచేందుకు సర్వశక్తులూ ఒడ్డుతారు. రిగ్గింగ్ చేసి గెలిస్తే తప్పు కానీ ఓటర్ల మద్దతుతో విజయం సాధిస్తే తప్పెలా అవుతుంది. ప్రకాష్ రాజ్ అయినా… నాగబాబు అయినా… ఈ చిన్న లాజిక్‌ను మర్చిపోతే ఎలా? అంటూ కొందరు వారి రాజీనామా నిర్ణయాలను తప్పుబడుతున్నారు. గెలిస్తే సేవచేస్తా..ఓడిపోతే వెళ్లిపోతే అనడం కాదు.. చిత్తశుద్ధి ఉంటే మా లో ఉంటూ సేవ చేస్తే..ఈసారి కాకపోతే వచ్చే సారైనా మా ప్రెసిడెంట్ కావచ్చని కొందరు ప్రకాష్ రాజ్ కి సూచిస్తున్నారు.

నాన్ లోకల్ అంశం కారణంగానే ప్రకాష్ రాజ్ హర్ట్ అయ్యారు కాబట్టి.. దీన్ని ఎన్నికల అంశం చేసినందుకు విష్ణు పశ్చాత్తాపం వ్యక్తంచేయాలన్న మరో వాదన వినిపిస్తోంది.

Also Read..

Huzurabad: హుజూరాబాద్‌ వాసుల పంట పండింది.. సంక్షేమ పథకాలకు భారీగా నిధులు.. 3 నెలలల్లో 4 వేల కోట్లు..!

Kadiri: కదిరిలో ప్రయాణికుడిపై ఆర్టీసీ సిబ్బంది దాడి.. మెడపట్టుకొని కిందకు తోసి రౌండప్‌.. వైరల్ వీడియో

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.