Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kadiri: కదిరిలో ప్రయాణికుడిపై ఆర్టీసీ సిబ్బంది దాడి.. మెడపట్టుకొని కిందకు తోసి రౌండప్‌.. వైరల్ వీడియో

ప్రయాణికుల భద్రతే మాకు ముఖ్యం. ఆర్టీసీలో ప్రయాణం సురక్షితం. ఇవి ప్రభుత్వ బస్సులో తరచూ చూస్తాం. కానీ.. అదే ఆర్టీసీ సిబ్బంది ఓ ప్యాసింజర్‌ను

Kadiri: కదిరిలో ప్రయాణికుడిపై ఆర్టీసీ సిబ్బంది దాడి..  మెడపట్టుకొని కిందకు తోసి రౌండప్‌.. వైరల్ వీడియో
Kadiri Rtc Employees Attack
Follow us
Venkata Narayana

|

Updated on: Oct 11, 2021 | 6:32 PM

Kadiri RTC Employees Attack on Passenger: ప్రయాణికుల భద్రతే మాకు ముఖ్యం. ఆర్టీసీలో ప్రయాణం సురక్షితం. ఇవి ప్రభుత్వ బస్సులో తరచూ చూస్తాం. కానీ.. అదే ఆర్టీసీ సిబ్బంది ఓ ప్యాసింజర్‌ను పట్టుకొని చితకబాదేశారు. మెడ పట్టి బస్సులోంచి తోసేశారు. ఎవ్వరికీ చెప్పుకుంటావో.. చెప్పుకోమంటూ హెచ్చరించారు. అనంతపురం జిల్లా కదిరిలో RTC సిబ్బంది చూపించిన ఓవరాక్షన్‌ ఇది.

వివరాల్లోకి వెళ్తే, కుప్పం నుండి హైదరాబాద్‌ వెళ్తున్న ఆర్టీసీ బస్సు కదిరి బస్టాండ్‌లో ఆగింది. అక్కడ ఓ ప్రయాణికుడికి సీటు కేటాయించే విషయంలో ఆర్టీసీ సిబ్బందితో గొడవ జరిగింది. కండక్టర్‌- ప్రయాణికుడి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో అక్కడే ఉన్న ఆర్టీసీ సిబ్బంది సహనం కోల్పోయి ప్రయాణికుడి పై దాడికి పాల్పడ్డారు. బస్సులో అందరూ చూస్తుండగానే ప్యాసింజర్‌ మెడపట్టుకొని కిందకు తోసేశారు.

అనంతరం ఐదారుగురు ఆర్టీసీ సిబ్బంది అతనిపై దాడి చేశారు. నలుగురు కలిసి అదేపనిగా రౌండప్‌ చేసి కొట్టారు. బస్టాండ్‌లో ఉన్న ప్రయాణికులంతా ఈ దృశ్యాన్ని చూసి ఆపే ప్రయత్నం చేశారు. ఐనా వినిపించుకోలేదు. ఏకంగా బస్టాండ్‌ నుంచే వెళ్లిపోవాలని ప్రయాణికుడికి ఆర్టీసీ సిబ్బంది హుకూం జారీ చేశారు. ఈ దృశ్యాలన్నీ అక్కడున్న ప్రయాణికులు తమ సెల్‌ఫోన్‌లో బంధించారు.

సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌ కావడంతో ఆర్టీసీ సిబ్బంది తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. దాంతో ఈ ఘటనపై ఆర్టీసీ విచారణ అధికారి స్పందించారు. ప్రయాణికుడే మద్యం మత్తులో ఆర్టీసీ సిబ్బందితో గొడవపడ్డారని విచారణ అధికారి ఎంసీఎస్‌ రెడ్డి చెప్పారు. ఈ విషయంపై డయల్‌ హండ్రేడ్‌కి కూడా కాల్‌ చేసి సమాచారమిచ్చామని తెలిపారు.

Read also: Attack on Constable: కానిస్టేబుల్‌పై దాడి చేసిన ముగ్గురు నిందితులు అరెస్ట్.. రౌడీ షీట్లు నమోదు