AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Huzurabad: హుజూరాబాద్‌ వాసుల పంట పండింది.. సంక్షేమ పథకాలకు భారీగా నిధులు.. 3 నెలలల్లో 4 వేల కోట్లు..!

Huzurabad Development: దళితబంధు, ఆసరా పెన్షన్లు, అభివృద్ధి పథకాలు, సంక్షేమ భవనాలు, సీసీ రోడ్లు, వడ్డీలేని రుణాలు ఇలా హామీల జల్లులో తడిసిముద్దవుతున్నారు హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు.

Huzurabad: హుజూరాబాద్‌ వాసుల పంట పండింది.. సంక్షేమ పథకాలకు భారీగా నిధులు.. 3 నెలలల్లో 4 వేల కోట్లు..!
Huzurabad Copy
Follow us
Balaraju Goud

|

Updated on: Oct 11, 2021 | 6:39 PM

Huzurabad Development: మూడే మూడు నెలలు.. 4 వేల కోట్లు..! హుజురాబాద్ నియోకవర్గంపై హమీల వర్షం కురుస్తోంది. అంతే ధీటుగా నిధుల వరద పారుతోంది. దళితబంధు, ఆసరా పెన్షన్లు, అభివృద్ధి పథకాలు, సంక్షేమ భవనాలు, సీసీ రోడ్లు, వడ్డీలేని రుణాలు ఇలా హామీల జల్లులో తడిసిముద్దవుతున్నారు హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు. రాష్ట్రంలోని మరే నియోజకవర్గంలో లేనంతగా అభివృద్ధి పరుగులు పెడుతోంది. ఎన్నేళ్లలో ఎన్నడులేనంతా అభవృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి.

దళితబంధు – రూ.2,200 కోట్లు సంక్షేమభవనాలు, రోడ్లు – రూ. 800 కోట్లు అభివృద్ధి పథకాలు – రూ. 600 కోట్లు వడ్డీలేని రుణాలు – రూ. 200 కోట్లు హుజురాబాద్ మున్సిపాలిటీ – రూ. 20 కోట్లు

గడిచిన 3 నెలల్లో హుజురాబాద్ నియోకవర్గంలో వివిధ సంక్షేమ పథకాలకు చేసిన ఖర్చు ఇది. కొత్త స్కీమ్‌లు వచ్చాయి. నిలిచిపోయిన పనులకు మోక్షం కలుగుతోంది. పెండింగ్ లో ఉన్న ఆసరా పెన్షన్లు, సెకండ్ ఫేజ్ గొర్రెల పంపిణీలో కదలిక వచ్చింది. సీసీ రోడ్లు, లింక్ రోడ్లు, కమ్యూనిటీ హాళ్లు, సంక్షేమ భవనాలు, కుల సంఘాల భవనాలు, వడ్డీలేని రుణాలు ఇలా ఒక్కటేమిటి స్కీమ్‌లే స్కీమ్‌లు. సింపుల్‌గా చెప్పాలంటే నిధుల వరదే పారుతోందక్కడ.

మిగతా పథకాలన్నీ ఒకఎత్తు. దళితబంధు మరో ఎత్తు. సమాజంలో తరతరాలుగా అణిచివేతకు గురవుతున్న దళితులకు సముచిత స్థానం కల్పించడమే లక్ష్యంగా ఈ స్కీమ్‌ను తీసుకొచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మానసపుత్రిక ఇది. దళితబంధుకు పైలెట్‌ ప్రాజెక్టుగా హుజూరాబాద్ నియోజకవర్గాన్ని ఎంపిక చేశారు. వివిధ రకాల సర్వేల తర్వాత లబ్దిదారుల్ని ఎంపిక చేశారు. 23 వేల మందిని అర్హులుగా గుర్తించారు. ఇప్పటికే 17 వేల మంది ఖాతాల్లో రూ. 10 లక్షల చొప్పున జమ చేశారు. నాలుగు దఫాలుగా మొత్తం రూ. 2 వేల 200 కోట్లు విడుదల చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం..

అంతేకాదు.. అటు ఆసరా పెన్షన్లకూ మోక్షం లభించింది. ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా పెన్షన్లు మంజూరు చేయలేదు. ఈ 3 ఏళ్లలో 57 ఏండ్లు నిండినోళ్లు, వితంతువులు, సదరం సర్టిఫికెట్ పొందిన దివ్యాంగులు, ఒంటరి మహిళలు, బీడీ, చేనేత, గీత కార్మికులు కొత్త పెన్షన్ల కోసం ఎదురుచూశారు. ఇలాంటి అర్హులు రాష్ట్రంలో 15 లక్షల మంది వరకు ఉంటారని అంచనా. అయితే, 57 ఏండ్లు దాటినోళ్లంతా పెన్షన్‌కు దరఖాస్తు చేసుకోవాలని ఇటీవలే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దాదాపు 10 లక్షల మంది మీ సేవ కేంద్రాల ద్వారా అప్లికేషన్లు పెట్టుకున్నారు. 3 నెలలుగా హుజూరాబాద్‌లో పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. కొత్తగా 10 వేల మందికి లబ్ధి చేకూరుతోంది.

ఇక, డ్వాక్రా గ్రూపులకు ఇచ్చే వడ్డీలేని రుణాల్లోనూ కదలికి వచ్చింది. ఇందుకోసం రూ. 200 కోట్లు విడుదల చేశారు. రూ. 120 కోట్లను హుజూరాబాద్‌‌లోని మహిళల సంఘాల ఖాతాల్లో జమచేశారు. ఇక కొత్త రోడ్లు, డ్రైనేజీ నిర్మాణం జోరుగా సాగుతోంది. గల్లీల్లో సీసీ రోడ్లు నిర్మించి, మెయిన్ బజార్లలో సెంట్రల్ లైటింగ్ సిస్టం ఏర్పాటు చేస్తున్నారు. నియోజకవర్గంలోని ప్రతి మండలానికి రూ. 30 కోట్ల చొప్పున ఐదు మండలాలకు కలిపి రూ. 150 కోట్లు కేటాయించారు. మొత్తంగా నియోజకవర్గంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, లింక్ రోడ్లకు రూ. 220 కోట్లు ఖర్చు చేస్తున్నారు.

దళితబంధుతో ఇతర వర్గాల్లో కాస్త అసంతృప్తి వచ్చింది. తమను పట్టించుకోవడం లేదని ఆందోళనలు కూడా జరిగాయి. దీంతో ఇతర కులాలపైనా రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. మంత్రులు హరీశ్​రావు, గంగుల, శ్రీనివాస్ గౌడ్ ఆత్మ గౌరవ సభలు నిర్వహించారు. ఆయా కుల సంఘాలకు స్థలాలు, భవనాలు మంజూరు చేశారు. హుజూరాబాద్‌లో ఈ నిధుల వరదంతా ఓట్ల కోసమేనని విమర్శిస్తున్నాయి విపక్షాలు. ఆ అవసరం తమకు లేదని అభివృద్ధే తమ ఎజెండా అని కొట్టిపారేస్తోంది ప్రభుత్వం.

Read Also… Raithu Runa Mafi: తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్.. వచ్చే మార్చిలోపు రూ.లక్ష రుణ మాఫీః మంత్రి హరీష్ రావు

బ్యాటర్ వికెట్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నా, వద్దంటోన్న చెత్త బౌలర్
బ్యాటర్ వికెట్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నా, వద్దంటోన్న చెత్త బౌలర్
వేసవిలో అధిక వేడితో తలనొప్పి వస్తుందా? చిటికెలో ఉపశమనం పొందాలంటే
వేసవిలో అధిక వేడితో తలనొప్పి వస్తుందా? చిటికెలో ఉపశమనం పొందాలంటే
ఉగ్రదాడిపై విచారణ మొదలుపెట్టిన NIA
ఉగ్రదాడిపై విచారణ మొదలుపెట్టిన NIA
వామ్మో.. పశువుల పాకలో భారీ శబ్దాలు.. ఏంటా అని చూడగా..
వామ్మో.. పశువుల పాకలో భారీ శబ్దాలు.. ఏంటా అని చూడగా..
ఈ పోస్టాఫీస్ పథకంపై వడ్డీ తగ్గించేస్తున్నారా.. ఇదీ క్లారిటీ
ఈ పోస్టాఫీస్ పథకంపై వడ్డీ తగ్గించేస్తున్నారా.. ఇదీ క్లారిటీ
తినడానికి తిండి లేక నీళ్లు తాగి బతికి.. ఇప్పుడు ఇండస్ట్రీలో సంచలన
తినడానికి తిండి లేక నీళ్లు తాగి బతికి.. ఇప్పుడు ఇండస్ట్రీలో సంచలన
దేశమంతా విషాదంలో ఉంటే వెకేషన్‌కు వెళతావా? టాలీవుడ్ నటిపై ట్రోల్స్
దేశమంతా విషాదంలో ఉంటే వెకేషన్‌కు వెళతావా? టాలీవుడ్ నటిపై ట్రోల్స్
ఆ హోదా ఇవ్వండి..! ఉగ్రదాడి బాధితురాలి డిమాండ్‌
ఆ హోదా ఇవ్వండి..! ఉగ్రదాడి బాధితురాలి డిమాండ్‌
పుచ్చకాయ తినేటప్పుడు పొరబాటున విత్తనం మింగేశారా?
పుచ్చకాయ తినేటప్పుడు పొరబాటున విత్తనం మింగేశారా?
పేల్చేస్తే పోలా! ఆర్మీనా మజాకా.. టెర్రరిస్టులు, వారి సహాయకులపై..
పేల్చేస్తే పోలా! ఆర్మీనా మజాకా.. టెర్రరిస్టులు, వారి సహాయకులపై..