Raithu Runa Mafi: తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్.. వచ్చే మార్చిలోపు రూ.లక్ష రుణ మాఫీః మంత్రి హరీష్ రావు

Telangana Crop Loan Runa Mafi: చ్చే మార్చి లోపు లక్ష రూపాయల రుణ మాఫీ చేస్తామని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు.

Raithu Runa Mafi: తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్.. వచ్చే మార్చిలోపు రూ.లక్ష రుణ మాఫీః మంత్రి హరీష్ రావు
Harish Rao
Follow us

|

Updated on: Oct 11, 2021 | 6:16 PM

Telangana Crop Loan Waiver: వచ్చే మార్చి లోపు లక్ష రూపాయల రుణ మాఫీ చేస్తామని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతల ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో దేశంలో ఎక్కడా లేని రుణమాఫీ అమలు చేస్తున్నామన్నారు. ఇప్పటికే రూ.50 వేల వరకు రుణమాఫీ చేశామన్నారు. గత ప్రభుత్వాలు రైతులను ఎరువుల కోసం క్యూ లైన్లో నిలబెట్టాయని గుర్తు చేశారు.

కరీంనగర్ జిల్లా ఇల్లందకుట మండలం రాచపల్లిలో నిర్వహించిన టీఆర్ఎస్ ప్రచారంలో పాల్గొన్న మంత్రి హరీష్.. రైతు సంక్షేమానికి టీఆర్ఎస్ సర్కార్ కట్టుబడి ఉందన్నారు. అన్నదాతలను ఆదుకునేందుకు రుణమాఫీతో పాటు రైతు బంధు పథకాన్ని కూడా అమలు చేస్తున్న ఘనత ఒక్క కేసీఆర్‌కే దక్కిందన్నారు. ఈ సంధర్భంగా ప్రజా సమస్యల పరిష్కారంలో వెన్నంటే ఉండే ప్రభుత్వాలనే ఎన్నికోవాలని మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. రెండేళ్ల కిందట బండి సంజయ్‌ గెలిస్తే జరగని అభివృద్ధి, ఇప్పుడు ఈటల గెలిస్తే జరుగుతుందా అని ప్రశ్నించారు మంత్రి హరీష్‌రావు. గెల్లు శ్రీనివాస్‌ను గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. పేదలంటే ఎంతో నిర్లక్ష్యం చూపే రాజేందర్.. నమ్మకద్రోహి అన్నారు. అన్ని కులాల వారికీ రిజర్వేషన్లు కల్పించిన ఘనత టీఆర్‌ఎస్ దేనని.. ప్రతి పేదవారికి సంక్షేమ పథకాలు అందిస్తున్నాది కేసీఆరే అని అన్నారు మంత్రి హరీష్ రావు.