AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Decoration with Crore: అమ్మవారికి కోటి రూపాయలతో అలంకరణ.. చూడడానికి తరలొచ్చిన భక్తులు..

దేవుడిపై ప్రేమతో భక్తులు ఎన్నో చేస్తారు. దేవుళ్లను ఎన్నో రకాలుగా మొక్కుతారు. దేవుళ్లను పూలతో అలంకరిస్తారు. డబ్బులతో అలంకరిస్తారు. ముఖ్యంగా వినాయకచవితి సమయంలో గణపతిని డబ్బులున్న వాళ్లు పైసలతో అలంకరిస్తారు...

Decoration with Crore: అమ్మవారికి కోటి రూపాయలతో అలంకరణ.. చూడడానికి తరలొచ్చిన భక్తులు..
Ammavaru2
Srinivas Chekkilla
|

Updated on: Oct 11, 2021 | 6:04 PM

Share

దేవుడిపై ప్రేమతో భక్తులు ఎన్నో చేస్తారు. దేవుళ్లను ఎన్నో రకాలుగా మొక్కుతారు. దేవుళ్లను పూలతో అలంకరిస్తారు. డబ్బులతో అలంకరిస్తారు. ముఖ్యంగా వినాయకచవితి సమయంలో గణపతిని డబ్బులున్న వాళ్లు పైసలతో అలంకరిస్తారు. దేవి నవరాత్రుల సమయంలో కూడా అమ్మవారిని డబ్బుతో అలంకరిస్తారు. ఇలా చేస్తే తమకు భాగ్యం కలుగుతుందని భక్తుల నమ్మకం.

నిజామాబాద్ జిల్లాలో కూడా ఇలానే చేశారు. కోటి రూపాయలతో అమ్మవారికి అలంకరణ చేశారు. నందిపేట్ మండల కేంద్రంలోని పాతుర్‎లో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిర్వాహకులు లక్ష్మీదేవి రూపంలో ఉన్న అమ్మవారిని కోటి రూపాయలతో అలంకరించారు. అందులో రెండు వేల రూపాయల నోట్లు, ఐదు వందల రూపాయల నోట్లు ఉన్నాయి. డబ్బుతో అలంకరించిన అమ్మవారిని చూసేందుకు భక్తులు తరలివస్తున్నారు. కోటి రూపాయల డబ్బు కాబట్టి అక్కడ నిర్వాహకులు కాపలగా ఉన్నారు. అమ్మవారికి డబ్బుతో అలంకరించిన వీడియో సోషల్ మీడియోలో వైరల్‎గా మారింది.

గత సంవత్సరం గద్వాల పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారిని డబ్బుతో అలంకరించారు. కన్యకా పరమేశ్వరి మాతను భక్తులు కోటి రూపాయల విలువైన నోట్లతో అత్యంత సుందరంగా అలంకరించారు.

Read Also… Bathukamma 2021: అయోమయంలో సద్దుల బతుకమ్మ వేడుకలు.. క్లారిటీ ఇవ్వండి అంటున్న ప్రజలు..