Maa Elections 2021: తొలిసారి మీడియా ముందుకొచ్చిన మంచు విష్ణు.. వారి రాజీనామాను ఆమోదించనంటూ..

Maa Elections 2021: సాధారణ రాజకీయాలను తలదన్నె రీతిలో జరిగిన మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ ఎన్నికలు ఎట్టకేలకు ముగిశాయి. తీవ్ర పోటీ నడుమ జరిగిన ఎన్నికల్లో మంచు విష్ణు అనూహ్య విజయాన్ని అందుకున్నారు...

Maa Elections 2021: తొలిసారి మీడియా ముందుకొచ్చిన మంచు విష్ణు.. వారి రాజీనామాను ఆమోదించనంటూ..
Manchu Vishnu
Follow us
Narender Vaitla

|

Updated on: Oct 11, 2021 | 7:43 PM

Maa Elections 2021: సాధారణ రాజకీయాలను తలదన్నె రీతిలో జరిగిన మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ ఎన్నికలు ఎట్టకేలకు ముగిశాయి. తీవ్ర పోటీ నడుమ జరిగిన ఎన్నికల్లో మంచు విష్ణు అనూహ్య విజయాన్ని అందుకున్నారు. ఎన్నికలను ఎంతో చాలెంజింగ్‌గా తీసుకున్న విష్ణు అందుకు తగ్గట్లుగానే తీవ్రంగా కృషి చేశారు. తండ్రి మోహన్‌ బాబు సహాయంతోపాటు ఇండస్ట్రీలో పలువురి సపోర్ట్‌తో అధ్యక్ష పీఠాన్ని అధిరోహించారు. ఇతర ప్రాంతాల్లో ఉన్న వారికి కూడా ప్రత్యేకంగా ఫోన్‌లు చేసి మరీ ఎన్నికల కోసం పిలిపించారు. జెనిలీయా, జయప్రద ఇలా వచ్చిన వారే.. ఇలా మా ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విష్ణు విజయాన్ని సొంతం చేసుకున్నారు.

ఇదిలా ఉంటే అధ్యక్ష ఎన్నికలు ముగిసిన తర్వాత ఈ వివాదానికి తెర పడుతుందని అందరూ ఊహించారు. కానీ నాగబాబు, ప్రకాశ్‌ రాజులు మా సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఈ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా మంచు విష్ణు అధ్యక్షుడిగా గెలిచిన తర్వాత తొలిసారి మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన తన విజయానికి సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. అలాగే మా సభ్యత్వానికి రాజీనామా చేసిన వారి రాజీనామాలను తాను ఆమోదించడం లేదని విష్ణు తేల్చి చెప్పారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ విష్ణు పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. చిరంజీవీ తనను పోటీ నుంచి తప్పుకోమన్నారని చెప్పిన విష్ణు.. రామ్‌ చరణ్‌ ప్రకాశ్‌ రాజ్‌కు ఓటు వేశారని బాంబు పేల్చారు. మా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకరణం చేసిన వెంటనే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడి సినిమా వాళ్ల కష్టసుఖాలను చెప్పుకుంటామన్నారు.  తన విజయంలో తండ్రి మోహన్ బాబుదే కీలకమని చెప్పారు. ఆ తర్వాత తన విజయం కోసం నరేష్ ఎంతో కృషి చేశారని విష్ణు తెలిపారు.

మా ఎన్నికలపై విష్ణు ఇంకా ఏమంటున్నారో ఈ లైవ్‌ వీడియోలో చూడండి..

Also Read: Long COVID Syndrome: కరోనా నుంచి కోలుకున్న తరువాత లాంగ్ కోవిడ్ సిండ్రోమ్ మహిళల్లో ఎక్కువ.. జాగ్రత్తలు ఇలా..

Telangana 10th Class: పదో తరగతి పరీక్షలపై తెలంగాణ ఎడ్యుకేషన్‌ బోర్డ్‌ కీలక నిర్ణయం.. ఈ ఏడాది నుంచి..

తల్లి స్నానం చేస్తుంటే కూతురు ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ వీడియో షేర్ చేసింది.. కట్ చేస్తే..