తల్లి స్నానం చేస్తుంటే కూతురు ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ వీడియో షేర్ చేసింది.. కట్ చేస్తే..

సోషల్‌ మీడియా అనేది సామాన్యులకు ఓ పాశుపతాస్త్రం లాంటిది. దాన్ని ఎవరు ఎటు మల్చుకుంటే అటు ఉపయోగపడుతుంది. ఇంటర్నెట్ యుగంలో..

తల్లి స్నానం చేస్తుంటే కూతురు ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ వీడియో షేర్ చేసింది.. కట్ చేస్తే..
Woman In Bathroom

సోషల్‌ మీడియా అనేది సామాన్యులకు ఓ పాశుపతాస్త్రం లాంటిది. దాన్ని ఎవరు ఎటు మల్చుకుంటే అటు ఉపయోగపడుతుంది. ఇంటర్నెట్ యుగంలో స్మార్ట్‌ఫోన్‌ల వినియోగం పెరగడం వల్ల  కష్టమైన పనులు కూడా ఈజీగా మారుతున్నాయి. కానీ కొన్నిసార్లు స్మార్ట్‌ఫోన్ కూడా సమస్యకు కారణంగా మారుతున్నాయి. స్మార్ట్‌ఫోన్‌లో చేసిన చిన్న పొరపాటు కారణంగా చాలాసార్లు ప్రజలు ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇటీవల చాలా ఆశ్చర్యకరమైన కేసు తెరపైకి వచ్చింది. నిజానికి ఒక మహిళ తన స్నానాల గదిలో స్నానం చేస్తోంది. ఈ సమయంలో ఆమె చిన్న అమ్మాయి తనకు ఇబ్బంది కలిగించేది చేసింది. నిజానికి అమ్మాయి తన సొంత తల్లి వీడియోను సోషల్ మీడియాలో లైవ్ చేసింది. ఆ తల్లికి కూడా తెలియదు.

ఆ మహిళ బాత్రూమ్ నుండి బయటకు వచ్చి  ఇన్‌స్టాగ్రామ్‌ను చూసిన తర్వాత కాని తెలియలేదు.. అది చూసిన ఆమె షాక్‌కు గురైంది. ఈ మహిళ స్వయంగా ఈ కథనాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. తాను బాత్రూంలో స్నానం చేస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగిందని ఆమె వెల్లడించింది. తన మూడేళ్ల కూతురు చేసిన చిన్న పారపాటుతో ఇలా జరిగిందని పేర్కొంది. చిన్నారి తన ఫోన్‌తో ఆడుకుంటుండగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను క్లిక్ చేసింది. ఆ తర్వాత వెంటనే బ్యాక్ కెమెరా ఆన్ అయ్యింది. ఆ తర్వాత లైవ్ టెలికాస్ట్ మొదలైంది.. ఇది గమనించని చిన్నారి తల్లి బాత్రూంలో స్నానం చేయడాన్ని రికార్డ్ చేయడం మొదలు పెట్టింది.

అయితే స్నానం ముగించుకుని వచ్చిన తల్లి ఇన్‌స్టా నుంచి వచ్చి నోటిఫికేషన్ చూసి అసలు విషయం గ్రహించింది.  దీంతో ఆమె ఉలిక్కిపడింది. వెంటనే ఇన్‌స్టాగ్రామ్ ప్రత్యక్ష ప్రసారాన్ని నిలిపివేసింది. నోటిఫికేషన్ చూసిన తర్వాత వీడియోను సోషల్ మీడియా నుంచి డిలీట్ చేసింది.

అయితే.. జరిగిన ఘటనపై ఇన్‌స్టాగ్రామ్‌లో వివరణ ఇచ్చుకుంది. తన కూతురు చాలా చిన్నదని.. అంతకు ముందు మొబైల్ ఎప్పుడూ ఆపరేట్ చేయలేదని పేర్కొంది. తన ఫోన్‌పై వివిధ  బటన్లను నొక్కుతున్న సమయంలో ఇలా జరిగిందని తెలిపింది. జరిగిన తప్పిదానికి మన్నించాలని కోరింది.

ఇవి కూడా చదవండి: Shiba Inu: బిట్ కాయిన్‌ను మించి పరుగులు.. 260 శాతం పెరిగిన శిబా ఇను.. మీరు కూడా..

Income Tax: ఇంట్లో ఎంత బంగారం దాచుకోవచ్చు.. చట్టం ఏం చెబుతోంది.. పూర్తి వివరాలు..

Viral Video: ఇది మామూలు మార్జాలం కాదురో.. స్పైడర్‌మాన్‌లా గోడపై పరుగులు పెట్టిన పిల్లి..

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Telugu