Maa Elections 2021: ‘ఓటమి అంటే అవమానం కాదు’.. ప్రకాశ్ రాజ్‌తో పవన్ కళ్యాణ్. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో..
Viral Video: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) మొదలైన నాటి నుంచి గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఎన్నికలు రసవత్తరంగా జరిగిన విషయం తెలిసిందే. హోరా హోరీ ప్రచారాలు, ఒకరిపై మరొకరు ఆరోపణలు..
Viral Video: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) మొదలైన నాటి నుంచి గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఎన్నికలు రసవత్తరంగా జరిగిన విషయం తెలిసిందే. హోరా హోరీ ప్రచారాలు, ఒకరిపై మరొకరు ఆరోపణలు ఇలా ఒక చిన్న అసోసియేషన్ ఎన్నికలు సాధారణ రాజకీయ ఎన్నికల్లా మారిపోయింది. ‘మా’ సభ్యులు కూడా రాజకీయా నాయకుల్లా మారి వాగ్వాదాలకు దిగిన విషయం తెలిసిందే. ఇలా ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన ఈ ఎన్నికల్లో చివరికి మంచు విష్ణు ప్యానెల్ గెలుపొందింది. ‘మా’ కొత్త అధ్యక్షులిగా విష్ణు ఘన విజయం సాధించారు. దీంతో ఆయన మద్ధతు దారులు పెద్ద ఎత్తున హంగామా చేశారు. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు.
ఇదిలా ఉంటే ఓటమిపాలైన ప్రకాశ్ రాజ్‌కు సంబంధించి కూడా నెట్టింట కొన్ని వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇందులో భాగంగానే నెటిజన్లను ఓ వీడియో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ చిత్రం ‘వకీల్‌సాబ్’లో ప్రకాశ్ రాజ్ పవర్ ఫుల్ లాయర్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో పవన్, ప్రకాశ్ పోటాపోటీగా నటించారు. వీరిద్దరూ టేకాఫ్ చేసుకున్న కేసులో చివరికి పవన్ కళ్యాణ్ విజయాన్ని సాధిస్తారు. ఆ సందర్భంగా ఓటమి బాధలో ఉన్న ప్రకాశ్ రాజ్ వద్దకు వచ్చిన పవన్.. ‘నందాజీ.. ఓటమి అంటే అవమానం కాదు. మనల్ని మనం గెలిచే అవకాశం. ఆల్ ది బెస్ట్’ అని చెబుతాడు. దానికి చిరు నవ్వుతో స్పందిస్తూ.. ప్రకాశ్ రాజ్ ‘థ్యాంక్స్’ చెబుతాడు. ఈ సంభాషణలు ప్రస్తుతం మా ఎన్నికలకు సరిగ్గా సూట్ కావడంతో కొందరు సినిమా అభిమానులు ఈ వీడియోను తెగ్ వైరల్ చేస్తున్నారు.
All the best @prakashraaj garu#PrakashRaj #MAAelection2021 pic.twitter.com/ityCvmHVTD
— Siddhu Siddardharoy™ (@NaveenTurimella) October 10, 2021
ఇదిలా ఉంటే మా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని చవిచూసిన ప్రకాశ్ రాజ్ సోమవారం ఉదయం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి.. ఇక్కడ ప్రాంతీయ వాదానికి ప్రాధాన్యత ఇస్తున్నారాన్ని. ఇలాంటి అసోసియేషన్‌లో తాను ఉండలేనంటూ మా సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే తెలుగు సినిమాల్లో తన ప్రస్థానాన్ని కొనసాగిస్తానని, తెలుగు సినిమా ఇండస్ట్రీలో అతిథిగానే మెదులుకుంటానని తేల్చి చెప్పాడు.
Also Read: Indo China Talks: చైనా మొండి వైఖరితో అసంపూర్తిగా ముగిసిన భారత్-చైనా సైనిక కమాండర్ స్థాయి చర్చలు..