Venkata Narayana |
Updated on: Oct 11, 2021 | 9:23 PM
ఇవాళ శ్రీవారిని దర్శించుకుని పట్టు వస్త్రాలు, సారె దేవదేవునికి సమర్పించారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. సాంప్రదాయ పంచకట్టుతో శ్రీవారికి పట్టువస్త్రాలను సీఎం జగన్ సమర్పించారు. అనంతరం గరుడ వాహన సేవలో సీఎం పాల్గొన్నారు.
దీంతో ఒకే కుటుంబంలో ఇద్దరికి ముఖ్యమంత్రి హోదాలో శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించే అవకాశం కలిగినట్లైంది. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఐదుసార్లు పట్టువస్త్రాలు అందించారు.
తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం మూడోసారి శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు
తిరుమల ఆలయం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి 1953లో టీటీడీకి వచ్చినప్పటి నుంచి శ్రీవారికి బ్రహ్మోత్సవాల సందర్భంగా పట్టువస్త్రాలను సమర్పించే సంప్రదాయం మొదలైంది.
తొలినాళ్లలో పట్టు వస్త్రాలను ఎండోమెంట్ అధికారులు, తర్వాత దేవదాయశాఖ మంత్రులు సమర్పించేవారు. ఎన్టీఆర్ హయాం నుంచి ముఖ్యమంత్రి స్వయంగా శ్రీవారికి పట్టువస్త్రాలను సమర్పించే సంప్రదాయం మొదలైంది.