ఆర్మీ ఆస్పత్రికి ఎంపీని తరలించండి.. తెలంగాణ హైకోర్టుకు ఆదేశాలు జారీ చేసిన సుప్రీంకోర్టు
Supreme Court: నర్సాపురం ఎంపీ రఘురామరాజుకు సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. దీన్ని జ్యుడిషియల్ కస్టడీగా భావించాలని స్పష్టం చేసింది.
నర్సాపురం ఎంపీ రఘురామరాజుకు సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. దీన్ని జ్యుడిషియల్ కస్టడీగా భావించాలని స్పష్టం చేసింది. వైద్య పరీక్షల పర్యవేక్షణకు న్యాయాధికారిని తెలంగాణ హైకోర్టు నియమించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. వైద్యపరీక్షలను వీడియో తీయాలని కూడా పేర్కొంది. ఆ నివేదికను సీల్డ్ కవర్‌లో అందించాలని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. ఈ ఆదేశాలు అమలయ్యేలా ఏపీ సీఎస్ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.
సోమవారం ఉదయం నుంచి ఎంపీ రఘురామకృష్ణరాజు బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. జస్టిస్ వినీత్ శరన్ నేతృత్వంలోని వెకేషన్ బెంచ్ దీనిపై విచారణ నిర్వహించింది. రఘురామరాజు తరఫున సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గీ, ఆదినారాయణ.. ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాదులు దుష్యంత్ దవే, వీవీ గిరి వాదనలు వినిపిస్తున్నారు.