Black Fungus: జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం.. ఆరోగ్య శ్రీ పరిధిలోకి ‘బ్లాక్ ఫంగస్’..
Black Fungus Disease: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆరోగ్య శ్రీ పరిధిలోకి 'బ్లాక్ ఫంగస్' వ్యాధి చికిత్సను..
Black Fungus Disease: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆరోగ్య శ్రీ పరిధిలోకి ‘బ్లాక్ ఫంగస్’ వ్యాధి చికిత్సను తీసుకొస్తూ ఆదేశాలు జారీ చేసింది. బ్లాక్ ఫంగస్ వ్యాధి సోకినవారికి ఆరోగ్య శ్రీ పరిధి చికిత్స అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని వెల్లడించారు. పాజిటివ్ కేసుల గుర్తింపు కోసం రాష్ట్రమంతా ఫీవర్ సర్వే నిర్వహిస్తున్నామని.. తీవ్రమైన లక్షణాలు ఉన్నవారిని ఆసుపత్రుల్లో చేర్చి చికిత్స అందిస్తున్నామని మంత్రి ఆళ్లనాని స్పష్టం చేశారు.
అటు రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 9 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయని.. వాటికీ సంబంధించిన కేసులను వెంటనే గుర్తించి చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారని మంత్రి చెప్పుకొచ్చారు. బ్లాక్ ఫంగస్ వ్యాధికి సంబంధించిన మందులను సమకూర్చాలని సీఎం అధికారులను ఆదేశించారు. కాగా, ఏపీలో అమలులో ఉన్న కర్ఫ్యూ నెలాఖరు వరకు పొడిగిస్తూ జగన్ సర్కార్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.