Mahesh Babu Fans: డిజిటల్ వార్‌కు మహేశ్ ఫ్యాన్స్ రెడీ.. మే 31 కోసం వెయిటింగ్
తన బర్త్‌డేకి అప్‌డేట్ ఇచ్చినా ఇయ్యకపోయినా... తండ్రి కృష్ణ బర్త్‌డే రోజు మాత్రం తప్పకుండా అప్‌డేట్ ఇవ్వటం మహేశ్ బాబుకు అలవాటు. అందుకే ఫ్యాన్స్...
తన బర్త్‌డేకి అప్‌డేట్ ఇచ్చినా ఇయ్యకపోయినా… తండ్రి కృష్ణ బర్త్‌డే రోజు మాత్రం తప్పకుండా అప్‌డేట్ ఇవ్వటం మహేశ్ బాబుకు అలవాటు. అందుకే ఫ్యాన్స్ మే 31కి ఇప్పటి నుంచే ప్రిపరేషన్ మొదలు పెట్టారు. గత డిజిటల్ రికార్డ్‌లన్ని తుడిచిపెట్టేయాలని పక్కాగా ప్లాన్ చేస్తున్నారు. ప్రజెంట్ ఫ్యాన్ వార్ ఎక్కువగా సోషల్ మీడియా ట్రెండ్స్‌లోనే కనిపిస్తుంది. అందుకే ఆ రికార్డ్‌లనే టార్గెట్ చేస్తున్నారు మహేశ్ ఫ్యాన్స్. మే 31 సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే. ఆ రోజు మహేశ్ లేటెస్ట్ మూవీ సర్కారువారి పాట నుంచి ఫస్ట్ లుక్ వస్తుందన్న టాక్ వినిపిస్తోంది. దీంతో సోషల్ మీడియా ట్రెండ్స్‌కు ప్రిపేర్ అవుతున్నారు ఫ్యాన్స్. ఈ మధ్య రిలీజ్ అయిన హరిహర వీరమల్లు, ట్రిపులార్ లాంటి సినిమాల రికార్డ్‌లను దాటేయాలన్నది మహేష్ అభిమానుల స్కెచ్. మహేశ్ ఫ్యాన్స్ అనుకుంటే.. గత రికార్డులు తుడిచిపెట్టడం ఎంతసేపు చెప్పండి.
పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సర్కారువారి పాట సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్. ఇప్పటికే దుబాయ్‌లో మేజర్ షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు కరోనా సెకండ్ వేవ్ కారణంగా బ్రేక్ పడింది. మహేశ్ మాస్ లుక్‌లో కనిపిస్తున్న ఈ సినిమాను 2022 సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది యూనిట్.
Also Read: ఏపీలో కర్ఫ్యూ ఈ నెలాఖరు వరకు పొడిగింపు.. మరికొన్ని కీలక నిర్ణయాలు