AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అయోధ్య బాల రామయ్యను చూద్దాం రమ్మంటున్న ఆర్టీసీ… ఎలా వెళ్లాలో తెలుసుకోండి..

ప్రతి నెల పౌర్ణమి రోజు అరుణాచల గిరి ప్రదక్షిణ చేసేలాగా అరుణాచలానికి ప్రత్యేక సర్వీసును కొవ్వూరు ఆర్టీసీ డిపో ఏర్పాటు చేసింది. అటు ప్రయాణికులను గమ్య స్థానాలకు చేర్చడంలో బాధ్యతగా వ్యవహరిస్తూ భక్తుల సౌకర్యార్థం తీర్థయాత్రలకు సంబంధించి కొవ్వూరు డిపో ఏర్పాటు చేసిన ప్రత్యేక సర్వీసుల పట్ల ఆర్టీసీకి పలువురు అభినందనలు తెలియజేస్తున్నారు.

అయోధ్య బాల రామయ్యను చూద్దాం రమ్మంటున్న ఆర్టీసీ... ఎలా వెళ్లాలో తెలుసుకోండి..
Special Bus Service
B Ravi Kumar
| Edited By: Jyothi Gadda|

Updated on: Feb 06, 2024 | 10:28 AM

Share

ఏలూరు: ఏపీఎస్ఆర్టీసీ రాష్ట్ర ప్రజల కోసం ఇప్పటికే ఎన్నో విశిష్ట సేవలను అందిస్తుంది. ప్రయాణికుల రద్దీ దృష్టిలో ఉంచుకొని పండుగ సమయాల్లో ప్రత్యేక అదనపు బస్సులను ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తూ ఆర్టీసీ సేవలు ముందుకు వెళుతున్నాయి. అలాగే ప్రయాణికుల సౌకర్యం ఇటీవల కార్గో సేవలు ఏర్పాటు చేసింది ఆర్టీసీ.. అలాగే ప్రముఖ ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రాలకు సైతం ప్రత్యేక సర్వీసులు నడుపుతూ ప్రైవేటు సర్వీస్లను తలదన్నేలా ఆర్టీసీ ప్రజలకు అందుబాటులో ఉంటుంది. ఈ క్రమంలోనే తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు ఆర్టీసీ డిపో ఆధ్యాత్మిక క్షేత్రాలు సందర్శించే భక్తుల కోసం కొత్తగా రెండు ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేసింది.

గత నెల 22వ తేదీ దేశవ్యాప్తంగా అయోధ్యలో బాల రాముని ప్రతిష్ట అంగరంగ వైభవంగా జరిగింది. అయోధ్య రాముని దర్శించేందుకు ఇప్పటికే పలుమార్గాల ద్వారా భక్తులు అక్కడికి చేరుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఈ క్రమంలో కొవ్వూరు డిపో నుంచి అయోధ్యకు ప్రత్యేక సర్వీస్ ఏర్పాటు చేసింది ఆర్టీసీ… అందులో ఒక సర్వీసు అయోధ్య మీదుగా కాశీకి, మరొక సర్వీసు అయోధ్య శివకాశి యాత్రకు.. అయితే, ఈ నెల 5 న ఇప్పటికే అయోధ్య మీదుగా కాశీకి కొవ్వూరు డిపో నుంచి సూపర్ లగ్జరీ బస్సు బయలుదేరింది.

యాత్రలో భువనేశ్వర్ లోని లింగరాజు ఆలయం, పూరి జగన్నాథ స్వామి ఆలయం, కోణార్క్ లోని సూర్య ఆలయం, జాజిపూర్ గిరిజా దేవి శక్తిపీఠం, ప్రయోగ త్రివేణి సంగమం, నైమిశారణ్యం సుదర్శన చక్ర తీర్థం, గోమతి నది, లలితా దేవి శక్తిపీఠం, అయోధ్య రామ జన్మభూమి, రామ్ లాల్ల , సరయు నది, వారణాసి విశ్వనాథ ఆలయం, గంగా నది, గయా మాంగళ్య గౌరీ శక్తిపీఠం, శిరోగయ అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం, శ్రీకూర్మం విష్ణుమూర్తి ఆలయం, అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయం మీదుగా ఈనెల 15న కొవ్వూరు చేరుతుంది.  ఇందుకోసం ఒక్కొక్క ప్రయాణికుడికి టికెట్ ధర రూ.11,500 గా ఆర్టీసీ నిర్ణయించింది.

ఇవి కూడా చదవండి

ఇక అయోధ్య శివకాశి యాత్ర రెండో సర్వీసు ఈనెల 10వ తేదీ మధ్యాహ్నం కొవ్వూరు నుంచి బయలుదేరింది. ఈ యాత్ర సుమారు 13 రోజులు పాటు కొనసాగుతోంది. ఇందుకోసం కోసం ఆర్టీసీ ఒక్కొక్క ప్రయాణికుడికి టికెట్ రూ.13,500 గా నిర్ణయించింది. అయితే కాశీ వరకు పాత సర్వీస్ అదిరిగానే చేరుకుంటుంది. తిరిగి వచ్చే క్రమంలో చిత్రకూట్, సతీ అనసూయ స్థలి, సత్య మహర్షి ఆశ్రమం, ఉజ్జయిని శక్తిపీఠం, మహకాళేశ్వర స్వామి ఆలయం, బాసర సరస్వతి దేవి ఆలయం, ధర్మపురి యోగ నరసింహస్వామి ఆలయం, కాలేశ్వరం ముక్తేశ్వర స్వామి ఆలయం, యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం, వరంగల్ వేయి స్తంభాల గుడి మీదుగా కొవ్వూరు చేరుకుంటుంది.

అంతేకాకుండా నవశైవ క్షేత్ర దర్శనీ పేరుతో మంత్రాలయం, అలంపురం మహానంది, యాగంటి, బనగానపల్లె, శ్రీశైలం, తిరుపురాంతకం, కోటప్పకొండ విజయవాడ క్షేత్రాలకు బస్సులు ఏర్పాటు చేశారు. వాటికి టిక్కెట్లు ధర రూ.3200 గా నిర్ణయించారు. అదేవిధంగా దేవాదాయ శాఖ సమన్వయంతో శ్రీశైలం దర్శించే భక్తులకు మల్లికార్జున స్వామి దర్శన సౌకర్యం కల్పించే కార్యాచరణకు ఆర్టీసీ ప్రణాళికలు రూపొందించింది. టిక్కెట్ రిజర్వేషన్లతో పాటు దర్శనం టికెట్ కూడా ముందుగానే పొందే అవకాశం కల్పించనున్నారు.

ప్రతి నెల పౌర్ణమి రోజు అరుణాచల గిరి ప్రదక్షిణ చేసేలాగా అరుణాచలానికి ప్రత్యేక సర్వీసును కొవ్వూరు ఆర్టీసీ డిపో ఏర్పాటు చేసింది. అటు ప్రయాణికులను గమ్య స్థానాలకు చేర్చడంలో బాధ్యతగా వ్యవహరిస్తూ భక్తుల సౌకర్యార్థం తీర్థయాత్రలకు సంబంధించి కొవ్వూరు డిపో ఏర్పాటు చేసిన ప్రత్యేక సర్వీసుల పట్ల ఆర్టీసీకి పలువురు అభినందనలు తెలియజేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..