ఈ రోడ్లపై నడుస్తుండగా మీ ఎలక్ట్రిక్ కార్ ఛార్జ్ చేయబడుతుంది..! విడిగా ఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు.. ఎక్కడంటే..

ఇది మొబైల్ ఫోన్‌ల వైర్‌లెస్ ఛార్జింగ్ కోసం ఉపయోగించే టెక్నాలజీ మాదిరిగానే పనిచేస్తుంది. ఇలాంటి రోడ్లు, సాంకేతికతలు ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలను పెంచడానికి, సంబంధిత సమస్యలను పరిష్కరించడానికి సహాయపడతాయని భావిస్తున్నారు. రేంజ్ ఇష్యూ, పబ్లిక్ ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ప్రయాణ సమయంలో వాహనాన్ని ఛార్జ్ చేయడానికి పట్టే సమయం వంటివన్నీ ప్రజలను ఎలక్ట్రిక్ వాహనాలకు మారడానికి దోహదపడే అంశాలు.

ఈ రోడ్లపై నడుస్తుండగా మీ ఎలక్ట్రిక్ కార్ ఛార్జ్ చేయబడుతుంది..! విడిగా ఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు.. ఎక్కడంటే..
Wireless Charging for Electric Road Cars
Follow us
Jyothi Gadda

|

Updated on: Feb 06, 2024 | 8:03 AM

ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు బలమైన ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను నిర్మించడంపై దృష్టి సారిస్తుండగా, అమెరికాలో ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ కోసం కొత్త సాంకేతికతను అభివృద్ధి చేస్తోంది. అమెరికాలోని మిచిగాన్‌లో డెట్రాయిట్ అనే నగరం ఉంది. ఇక్కడ దేశంలో మొట్టమొదటి వైర్‌లెస్ ఎలక్ట్రిక్ రోడ్డు నిర్మించబడింది. ఈ రహదారి కార్క్‌టౌన్ ప్రాంతంలో ఉంది. ఇక్కడ14వ స్ట్రీట్‌లో ఎలక్ట్రిక్ కారును నడపడం, దాని బ్యాటరీ డిశ్చార్జ్ అవ్వదు.. బదులుగా ఛార్జ్ అవుతూనే ఉంటుంది. అంతేకాదు.. ఈ రోడ్డు చూసేందుకు మాత్రం … ఇతర తారు రోడ్డు మాదిరిగానే కనిపిస్తుంది. కానీ, ఇది మీ కారు బ్యాటరీని వైర్‌లెస్‌గా ఛార్జ్ చేయగల శక్తిని కలిగి ఉంటుంది. ఈ రహదారి పొడవు 400 మీటర్లు.

వైర్‌లెస్ ఎలక్ట్రిక్ రోడ్డు ఎలా తయారు చేయబడింది? :

వైర్‌లెస్ ఎలక్ట్రిక్ రోడ్డును నిర్మించేందుకు రహదారి ఉపరితలం కింద విద్యుదయస్కాంత కాయిల్స్ ఏర్పాటు చేస్తారు.. ఇవి నగరంలోని ఎలక్ట్రిసిటీ గ్రిడ్‌కు అనుసంధానించబడి, అక్కడి నుంచి విద్యుత్తు సరఫరా చేయబడుతున్నాయి. విద్యుత్తు సరఫరా అవుతున్నప్పుడు.. విద్యుదయస్కాంత కాయిల్స్ ఆ రోడ్డుపై విద్యుదయస్కాంత క్షేత్రాన్ని సృష్టిస్తాయి. ఇది ఎలక్ట్రిక్ వాహన బ్యాటరీ, రిసీవర్‌కు శక్తిని బదిలీ చేస్తుంది. ఈ ప్రక్రియను ఇన్ట్యూటివ్ ఛార్జింగ్ అంటారు.

ఇవి కూడా చదవండి

ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడం:

ఇది మొబైల్ ఫోన్‌ల వైర్‌లెస్ ఛార్జింగ్ కోసం ఉపయోగించే టెక్నాలజీ మాదిరిగానే పనిచేస్తుంది. ఇలాంటి రోడ్లు, సాంకేతికతలు ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలను పెంచడానికి, సంబంధిత సమస్యలను పరిష్కరించడానికి సహాయపడతాయని భావిస్తున్నారు. రేంజ్ ఇష్యూ, పబ్లిక్ ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ప్రయాణ సమయంలో వాహనాన్ని ఛార్జ్ చేయడానికి పట్టే సమయం వంటివన్నీ ప్రజలను ఎలక్ట్రిక్ వాహనాలకు మారడానికి దోహదపడే అంశాలు. ఇది ప్రజలు ICE వాహనాలకు అతుక్కుపోయేలా చేస్తుంది.

ఈ దేశాల్లో కూడా వైర్‌లెస్ ఎలక్ట్రిక్ రోడ్:

ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించాలంటే వాటిని పరిష్కరించాల్సిన అవసరం ఉంది. వైర్‌లెస్ ఎలక్ట్రిక్ రోడ్లు దీనికి సహాయపడతాయి. అమెరికాతో పాటు యూరప్, ఇజ్రాయెల్‌లో కొన్ని చోట్ల వైర్‌లెస్ ఎలక్ట్రిక్ రోడ్లు నిర్మించబడ్డాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..