Watch Video: పాపం.. లైవ్‌ ఉండగానే తనను తాను చెంప చెల్లుమనిపించుకున్న జర్నలిస్ట్‌..! కారణం ఇదేనట..!!

లైవ్‌లో ఉండగా ఆమె తన ముఖాన్ని తానే కొట్టుకోవడం కనిపిస్తుంది. షోలో ఉన్న మిగిలిన వారు అదంతా చూసి ఆశ్చర్యపోయారు. కార్యక్రమంలో పాల్గొన్న వారితో పాటు మిగతా వారంతా అవాక్కయ్యారు. అయితే ఆ తర్వాత జర్నలిస్ట్ తనను తాను కొట్టుకున్న కారణం వెలుగులోకి వచ్చింది. అది తెలిశాక అందరూ అయ్యో పాపం అంటున్నారు..

Watch Video: పాపం.. లైవ్‌ ఉండగానే తనను తాను చెంప చెల్లుమనిపించుకున్న జర్నలిస్ట్‌..! కారణం ఇదేనట..!!
Australian Reporter
Follow us
Jyothi Gadda

|

Updated on: Feb 05, 2024 | 1:04 PM

ఒక మహిళా జర్నలిస్ట్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో లైవ్‌లో ఉండగా ఆమె తన ముఖాన్ని తానే కొట్టుకోవడం కనిపిస్తుంది. షోలో ఉన్న మిగిలిన వారు అదంతా చూసి ఆశ్చర్యపోయారు. కార్యక్రమంలో పాల్గొన్న వారితో పాటు మిగతా వారంతా అవాక్కయ్యారు. అయితే ఆ తర్వాత జర్నలిస్ట్ తనను తాను కొట్టుకున్న కారణం వెలుగులోకి వచ్చింది. ఒక దోమ ఆమె ముఖం మీద కుడుతుంది. దాంతో ఆమె దానిని వదిలించుకోవడానికి ప్రయత్నిస్తూ తనను తాను చెంపదెబ్బ కొట్టుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారడంతో జనాలు తెగ నవ్వుకుంటున్నారు.

ఆ రిపోర్టర్ పేరు ఆండ్రియా క్రౌథర్ అని తెలిసింది. ఆమె టుడే షో ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేస్తోంది. ఆమె తదుపరి ప్రత్యక్ష ప్రసారంలో ఈ సంఘటన తర్వాత ఆండ్రియా టోపీ ధరించి కనిపించటం గమనార్హం.

ఇవి కూడా చదవండి

ఆమె ఇటీవల బ్రిస్బేన్‌కు వెళ్లి అక్కడ వరదల గురించి నివేదిక అందజేశారు. ఈ క్రమంలోనే ఆమె లైవ్‌లో ఉండగా ఆమె ముఖం మీద ఒక దోమవాలింది. దాంతో ఆమె దోమను వదిలించుకోవటం కోసం తనను తాను చెంపదెబ్బ కొట్టుకోవాల్సి వచ్చింది. ఈ తతంగమంతా లైవ్‌ వీడియోలో స్పష్టంగా కనిపించింది. ఆండ్రియా వెంటనే కెమెరా నుండి వెనుదిరిగింది. అయితే ఆ ఘటనకు సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. దాంతో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

అయితే, ఆ రిపోర్టర్‌ లైవ్‌ ఇస్తున్న ప్రదేశంలో వాతావరణం పూర్తిగా మురదమయంగా మారింది. చుట్టూ చాలా మురికిగా ఉంది. తడి వాతావరణం, చుట్టూ పేరుకుపోయిన బురదనీటితో దోమల శబ్దం భయంకరంగా వినిపిస్తుంది. ఈ క్రమంలోనే ఆమె లైవ్‌ ఉండగా ఆమె దోమకాటుకు గురైంది.. దాని నుంచి తప్పించుకోవటం కోసమే ఆమె తనను తాను చెంపదెబ్బ కొట్టుకోవాల్సి వచ్చిందని ఆ తర్వాత వెల్లడించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..