AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: ఆనంద్‌ మహీంద్ర షేర్‌ చేసిన రోబోటిక్‌ మెషిన్‌.. హైదరాబాద్‌కు అర్టెంట్‌ సార్‌ అంటున్న నెటిజన్లు.. ఇది ఏం చెస్తుందంటే..!

ఆనంద్ మహీంద్రా ఈ వీడియోను తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో షేర్ చేశారు. దానికి క్యాప్షన్‌గా.. నేను పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నానంటూ పేర్కొన్నారు.

Watch Video: ఆనంద్‌ మహీంద్ర షేర్‌ చేసిన రోబోటిక్‌ మెషిన్‌.. హైదరాబాద్‌కు అర్టెంట్‌ సార్‌ అంటున్న నెటిజన్లు.. ఇది ఏం చెస్తుందంటే..!
River Cleaning Robot
Jyothi Gadda
|

Updated on: Feb 05, 2024 | 11:56 AM

Share

ఇంటర్నెట్‌లో అత్యంత యాక్టివ్‌గా ఉండే భారతీయ ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా, సోషల్ మీడియాలో తన అభిమానుల కోసం ఎప్పుడూ ఏదో ఒక విషయాన్ని షేర్ చేస్తుంటారు. వినియోగదారులు సైతం ఆనంద్‌ మహీంద్ర చేసిన ఫోటోలు, వీడియోలను ఇష్టపడతారు. ఆనంద్ మహీంద్రా అంటే కూడా అతని అభిమానులు, అనుచరులు చాలా ఇష్టపడతారు. తాజాగా ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియా X ద్వారా మరో కొత్త వీడియోను పంచుకున్నారు. ఇది చాలా వేగంగా వైరల్ అవుతోంది. వీడియో చూసిన ప్రతిఒక్కరూ స్పందించారు.

ఒకప్పుడు మనుషులు తమ పని తాము చేసుకునే పరిస్థితి ఉండేది. కానీ ప్రస్తుతం పెరుగుతున్న టెక్నాలజీ యుగంలో కేవలం ఒక కమాండ్‌ ఉంటే చాలా.. మీ పని అంతా స్వయంచాలకంగా జరుగుతుంది. నేడు సాంకేతిక పరిజ్ఞానం ఎంతగా అభివృద్ధి చెందిందంటే ఆహారాన్ని కూడా యంత్రాల ద్వారానే తయారు చేయవచ్చు. అలాంటి అద్వీతియమైన టెక్నాలజీకి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక నదిలో మురికిని శుభ్రపరిచే యంత్రం ఈ వీడియోలో కనిపించింది. ఇది నదిలో ఉన్న మురికిని శుభ్రపరుస్తుంది. వీడియో చూస్తుంటే ఈ రోబోటిక్ మెషిన్ నది ఒడ్డున ఉన్న మురికిని మొత్తం సేకరించి నదిని శుభ్రపరిచే పనిలో నిమగ్నమై ఉన్నట్లు తెలుస్తోంది. ఈ యంత్రం ప్రత్యేకత ఏమిటంటే దీన్ని నడపడానికి ఎటువంటి మానవశక్తి అవసరం లేదు.

ఇవి కూడా చదవండి

ఆనంద్ మహీంద్రా ఈ వీడియోను తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో పంచుకున్నారు. దానికి క్యాప్షన్‌గా.. నేను పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నానంటూ పేర్కొన్నారు. ఇక ఇంటర్‌నెట్‌లో ఈ వీడియోను చూసిన తర్వాత చాలా మంది వినియోగదారులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. వీడియోను చూసిన తర్వాత ఒక నెటిజన్‌ స్పందిస్తూ.. హైదరాబాద్, ఇతర సరస్సులు కలిగిన నగరాల్లో వీటికి భారీ డిమాండ్ ఉంది. వాటిని తయారు చేయడం ప్రారంభించండి అంటూ సూచించారు. భారతదేశంలో మహీంద్రా మాత్రమే దీన్ని తయారు చేయగలదు అంటూ పేర్కొన్నారు.. దయచేసి అలా చేయండి సార్ అంటూ చాలా మంది కోరుకున్నారు. ఈ వీడియోను ఇప్పటి వరకు 20 లక్షల మందికి పైగా వీక్షించారు. ప్రజలు ఈ వీడియోను విస్తృతంగా షేర్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..