ఆలయ అభివృద్ధికి యాచకుడి విరాళం.. ఎంతో తెలుసా ??

ఆలయ అభివృద్ధికి యాచకుడి విరాళం.. ఎంతో తెలుసా ??

Phani CH

|

Updated on: Feb 05, 2024 | 1:00 PM

ఆలయ అభివృద్ధికి ఓ యాచకుడు లక్షల్లో విరాళం అందచేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. పలు రకాల కారణాలతో ఎందరో భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తుంటారు. కానీ ఇతను మాత్రం భిన్నంగా ఆలోచించాడు. భిక్షాటనలో తనకు లభించిన ఆదాయంలో కొంత మొత్తం దైవకార్యాలకు వినియోగించాలని ఆలయానికి విరాళంగా ఇస్తూ వస్తున్నాడు. ఇప్పటికే ఇతను 8 లక్షలు పైనే విరాళంగా ఇచ్చాడు. విజయవాడ ముత్యాలంపాడులోని సాయిబాబా మందిరం వద్ద యాదిరెడ్డి అనే యాచకుడు భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.

ఆలయ అభివృద్ధికి ఓ యాచకుడు లక్షల్లో విరాళం అందచేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. పలు రకాల కారణాలతో ఎందరో భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తుంటారు. కానీ ఇతను మాత్రం భిన్నంగా ఆలోచించాడు. భిక్షాటనలో తనకు లభించిన ఆదాయంలో కొంత మొత్తం దైవకార్యాలకు వినియోగించాలని ఆలయానికి విరాళంగా ఇస్తూ వస్తున్నాడు. ఇప్పటికే ఇతను 8 లక్షలు పైనే విరాళంగా ఇచ్చాడు. విజయవాడ ముత్యాలంపాడులోని సాయిబాబా మందిరం వద్ద యాదిరెడ్డి అనే యాచకుడు భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఆయనకు ఓ ఆలోచన వచ్చింది. తనకు లభించిన మొత్తంలో కొంతైనా భవగవంతునికి విరాళంగా ఇవ్వాలనుకున్నాడు. ఈ క్రమంలో తాను బిచ్చమెత్తుకునే సాయిబాబా ఆలయ అభివృద్ధికి లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చారు. ఆ మందిరం గౌరవాధ్యక్షుడు గౌతమ్‌రెడ్డికి శుక్రవారం ఆ సొమ్ము అందించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అయోధ్య వీధుల్లో సుందర దృశ్యం.. పులకించి పోయిన రామ భక్తులు

ఏనుగు లైట్‌ తీసుకుంది గానీ.. లేదంటే చుక్కలే

Donald Trump: చేతిపై ఎర్రని మచ్చలు.. ట్రంప్ కు ఏమైంది ??

భార్య సాయంతో తండ్రిగా మారిన ట్రాన్స్‌జెండర్‌

‘సారీ.. మీ బాధ ఎవరికీ రాకూడదు’ తల్లితండ్రుల క్షమాపణ కోరిన జుకర్‌బర్గ్‌