ఏనుగు లైట్ తీసుకుంది గానీ.. లేదంటే చుక్కలే
ఏనుగుకి కోపం వచ్చిందంటే మమూలుగా ఉండదు మరి. ఎవరైనా తనకి నచ్చని పనులు చేసినా, దానిని రెచ్చగొట్టినా వారి పని పడుతుంది. తాజాగా ఊటీకి వెళ్తున్న కొందరు టూరిస్టులకి అలాంటి అనుభవమే ఎదురైంది. తనతో సెల్ఫీలు దిగేందుకు ప్రయత్నించిన టూరిస్టులను పరుగులు పెట్టించింది ఆ ఏనుగు. ఈ క్రమంలో వారు త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఏనుగుకి కోపం వచ్చిందంటే మమూలుగా ఉండదు మరి. ఎవరైనా తనకి నచ్చని పనులు చేసినా, దానిని రెచ్చగొట్టినా వారి పని పడుతుంది. తాజాగా ఊటీకి వెళ్తున్న కొందరు టూరిస్టులకి అలాంటి అనుభవమే ఎదురైంది. తనతో సెల్ఫీలు దిగేందుకు ప్రయత్నించిన టూరిస్టులను పరుగులు పెట్టించింది ఆ ఏనుగు. ఈ క్రమంలో వారు త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు ఏనుగు లైట్ తీసుకుంది కాబట్టి సరిపోయింది.. లేదంటే చుక్కలు చూపించేదంటున్నారు. ఇద్దరు టూరిస్ట్‌లు కర్ణాటక నుంచి బందీపూర్ నేషనల్ పార్క్, టైగర్ రిజర్వ్ మీదుగా కేరళకు వెళ్తున్నారు. దారి మధ్యలో వారికి ఓ పెద్ద ఎనుగు కనిపించింది. ఆ ఏనుగును చూసి ముచ్చటన పడిన వారు కారు దిగి దాంతో సెల్ఫీలు తీసుకునేందుకు ప్రయత్నించారు. అంతే తీవ్ర ఆగ్రహానికి గురైన ఏనుగు ఆ ఇద్దర్నీ వెంబడించింది. ఈ ఘటనతో ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురైన ఆ ఇద్దరు వ్యక్తులూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని పరుగులు తీశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Donald Trump: చేతిపై ఎర్రని మచ్చలు.. ట్రంప్ కు ఏమైంది ??
భార్య సాయంతో తండ్రిగా మారిన ట్రాన్స్‌జెండర్
‘సారీ.. మీ బాధ ఎవరికీ రాకూడదు’ తల్లితండ్రుల క్షమాపణ కోరిన జుకర్‌బర్గ్